కోహ్లీతో పోలుస్తూ.. రోహిత్ గాలి తీసేసిన గవాస్కర్?

praveen
దాదాపు గత మూడేళ్లపాటు ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ప్రస్తుతం మునుపటి ఫామ్ను అందుకొని దూసుకుపోతున్నాడని చెప్పాలి. ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ తో చెలరేగిన తర్వాత వరసగా సెంచరీలు చేస్తూ అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే ఇక తన ర్యాంకింగ్ ను కూడా మరింత మెరుగుపరుచుకుంటూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే 2023 సంవత్సరంలో భారత్లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కి ముందు కోహ్లీ ఫామ్ లోకి రావడం టీమిండియా కు శుభ సూచికం అని చెప్పాలి.

 అయితే విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడంతో ప్రస్తుతం రోహిత్ శర్మ ఒత్తిడిలో మునిగిపోయాడు అని చెప్పాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీతో సమానంగా సీనియర్గా కొనసాగుతున్న రోహిత్ ఇటీవల వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు. మంచి ఆరంభాలు ఇచ్చినప్పటికీ వాటిని భారీ స్కోర్ గా మార్చడంలో సక్సెస్ కాలేకపోతున్నాడు. అంతేకాదు సెంచరీ చేసి కూడా చాలా రోజులైంది. దీంతో రోహిత్ పై ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు. ఇదే విషయంపై సునీల్ గవాస్కర్  స్పందించాడు.

 విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాటింగ్ టెక్నిక్ లో ఎలాంటి లోపం లేదంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. అయితే లోపం కేవలం వికెట్ల మధ్య పరిగెత్తడం లోనే ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. ఒకపక్క కోహ్లీ బౌండరీలు సాధిస్తున్న వికెట్ల మధ్య వేగంగా పరిగెడుతూ ఉంటే ఇక రోహిత్ శర్మ మాత్రం పరుగుల కోసం బౌండరీల మీద ఎక్కువగా ఆధారపడుతున్నాడు అంటూ సునీల్ గవాస్కర్  వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా కోహ్లీ నేలమీద నుంచి షాట్లు ఆడుతుంటే అటు రోహిత్ శర్మ గాల్లోకి షాట్లు ఆడుతూ వికెట్ సమర్పించుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో కూడా ఇదే జరిగిందని సెంచరీ వరకు కోహ్లీ నేల మీదే షాట్లు ఆడడని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: