అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్.. తొలి బ్యాట్స్మెన్?

praveen
ప్రస్తుతం భారత జట్టు కొత్త ఏడాదిలో భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకతో టి20 సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టి20 సిరీస్ లో భాగంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగింది. అదే సమయంలో ఇక విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్లు ఎవరూ లేకుండానే బరులోకి దిగింది అని చెప్పాలి. అయితే ఇక టీమ్ ఇండియా ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఇక ఇటీవల భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టు అట్టు టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఇస్తుంది అని చెప్పాలి.

 మొదటి టి20 మ్యాచ్ లో రెండు పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. కానీ ఒకానొక సమయంలో మాత్రం శ్రీలంక విజయం సాధిస్తుందేమో అన్న విధంగానే బ్యాటింగ్ విధ్వంసం కొనసాగింది అని చెప్పాలి. అయితే రెండో టి20 మ్యాచ్ లో భాగంగా ఇక శ్రీలంక బ్యాట్స్మెన్లు నుంచి భారీ స్కోరు చేయగా ఆ తర్వాత లక్ష్య చేదనకు  దిగిన భారత బ్యాట్స్మెన్లు ఎంతో విరోచితంగా పోరాడినప్పటికీ చివరికి 16 పరుగులు తేడాతో ఓటమి చవిచూసింది టీమిండియా. అయితే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు అందరూ చేతులెత్తేసిన సమయంలో సూర్య కుమార్ యాదవ్, అక్షర్ పటేల్ జట్టును గెలిపించేందుకు తీవ్రంగా పోరాటం చేశారు అని చెప్పాలి. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.

 కాగా రెండో టి20 మ్యాచ్ లో భాగంగా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఏకంగా 65 పరుగులు చేసి రాణించాడు. ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. భారత తరఫున ఏడవ నెంబర్ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు. ఇప్పుడు వరకు రవీంద్ర జడేజా ఏడవ స్థానంలో వచ్చి 44 పరుగులు చేయగా.. ఇదే అత్యధికంగా కొనసాగింది. ఇక ఇప్పుడు అక్షర్ పటేల్ దీనిని బద్దలు కొట్టాడు.  అంతేకాకుండా టీమిండియా తరఫున ఒక టి20 మ్యాచ్ లో ఏడో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి అర్థ సెంచురీ బాదిన తొలి బ్యాట్స్మెన్ గా కూడా రికార్డ్ సృష్టించాడు అక్షర్ పటేల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: