షాకింగ్ : ఓటమికి బాధ్యత వహిస్తూ.. కెప్టెన్ రాజీనామా?

praveen
విధ్వంసకర బ్యాటింగ్కు భయంకరమైన బౌలింగ్కు పెట్టింది పేరు వెస్టిండీస్ జట్టు. ప్రపంచ క్రికెట్లో ఇప్పటి వరకు ప్రత్యర్థులను వనికిస్తూ ఎంతగానో హవా నడిపించింది వెస్టిండీస్ జట్టు. ఇక వెస్టిండీస్ ఆటగాళ్లు ఆడుతున్నారు అంటే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు సైతం వారి ఆటను చూసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక అంతేకాకుండా టి20 ఫార్మాట్లో రెండుసార్లు వరల్డ్ కప్ అందుకున్న మొదటి జట్టుగా కూడా వెస్టిండీస్ కొనసాగుతూ ఉంది.
 అంతర్జాతీయ క్రికెట్లో మేటి జట్లుగా కొనసాగుతున్న మిగతా టీమ్లకు సైతం సాధ్యం కానీ రెండు వరల్డ్ కప్పుల రికార్డు వెస్టిండీస్ ఖాతాలో చేరింది అని చెప్పాలి.  అలాంటి వెస్టిండీస్ జట్టు ఇక ఈ ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో మాత్రం ఎంత పేలవ ప్రదర్శన చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతకాలం నుంచి వెస్టిండీస్ దారుణమైన ప్రదర్శన కారణంగా రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచినప్పటికీ చివరికి వరల్డ్ కప్ లో ఆడాలి అంటే క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే క్వాలిఫైర్ మ్యాచ్లలో గెలిచి సూపర్ 12 కు అర్హత సాధిస్తుందని అందరూ అనుకున్నారు.
 ఊహించని రీతిలో రెండుసార్లు ఛాంపియన్ అయిన వెస్టిండీస్ జట్టు మాత్రం క్వాలిఫైయర్ దశ నుంచి ఇంటి బాట పట్టడం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి లోను చేస్తుంది. దీంతో వెస్టిండీస్ ను ఎంతోమంది విమర్శించడం మొదలుపెట్టారు.  ఇకపోతే ఇటీవలే వెస్టిండీస్ జట్టు కెప్టెన్ నికోలస్ పూరాన్  సంచలన నిర్ణయం తీసుకున్నాడు.. టి20 వరల్డ్ కప్ లో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ వన్డే, టి20 కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. కాగా ఇప్పుడు వరకు 23 టీ20 లు, 17 వన్డే మ్యాచ్ లకు వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్సీ వివహించాడు పూరాన్. అతను తప్పుకోవడంతో అతని స్థానంలో కొత్త కెప్టెన్ గా ఎవరూ రాబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: