గుడ్ న్యూస్.. జడేజా కోలుకున్నాడు?

praveen
వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు టీం ఇండియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది అన్న విషయం తెలిసిందే. కొన్నేళ్ల నుంచి జట్టులో కీలక ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా మోకాలి గాయం కారణంగా దూరమయ్యాడు. అతని మోకాలికి శస్త్ర చికిత్స జరగడంతో చివరికి వరల్డ్ కప్ మొత్తానికి కూడా అందుబాటులో లేకుండా పోయాడు. అతని స్థానంలో అటు అక్షర పటేల్ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక జడ్డు స్థానాన్ని అక్షర్ పటేల్ ఎంత మేరకు భర్తీ చేస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.
 ఇప్పుడు వరకు జరిగిన వార్మప్ మ్యాచ్లో మాత్రం అక్షర పటేల్ మంచి ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలోనే గాయం బారిన పడిన రవీంద్ర జడేజా తను త్వరగా కోలుకొని మళ్ళీ జట్టులోకి వస్తాను అంటూ అభిమానులకు చెప్పాడు. ఇక చెప్పినట్టుగానే మాట నిలబెట్టుకున్నాడు జడేజా అన్నది తెలుస్తుంది. మోకాలి సర్జరీ అనంతరం ప్రస్తుతం జడేజా కోలుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఇటీవలే తన ట్విట్టర్ వేదికగా ఒక ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశాడు రవీంద్ర జడేజా.

 ఇక ఈ వీడియోలో భాగంగా జిమ్ లో రవీంద్ర జడేజా అటు ఇటు పరిగెడుతున్న దృశ్యాలను చూడవచ్చు. ఈ క్రమంలోనే ఈ వీడియోలో తాను పూర్తిగా కోలుకున్నాను అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు జడ్డు బాయ్. ఈ క్రమంలోనే జడేజా గాయం నుంచి కోల్కున్నప్పటికీ పూర్తిస్థాయి ఫిట్నెస్ టెస్ట్ పాస్ అవుతాడ అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.  ఒకవేళ జడేజా  ఫిట్నెస్ సాధించిన కూడా ఇప్పట్లో అతను టీమిండియాలోకి రావడం సాధ్యమయ్యే పని కాదు అన్న చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే అతను స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర పటేల్ రాణిస్తున్నాడు. దీంతోఅ తను కోలుకున్న కూడా వరల్డ్ కప్ జట్టులోకి రావడం మాత్రం అనుమానమే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: