ఆసియా కప్ 2022: ఇలా జరిగితే పాకిస్తాన్ ఓటమి ఫిక్స్ ?

VAMSI
యూఏఈ వేదికగా ఆసియా కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మంచి ఆసక్తికరంగా మారింది ఈ టోర్నీ. మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం బరిలోకి దిగగా, రెండు జట్లు లీగ్ దశలోనే ఇంటి బాట పట్టాయి. మిగిలిన నాలుగు జట్లు మాత్రం సూపర్ 8 కు చేరుకున్నాయి. ఇక ఈ నాలుగు జట్లలో కూడా రెండు జట్లు ఇంటి బాట పట్టే సమయం ఆసన్నమైంది. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక మరియు ఆఫ్ఘన్ లు సూపర్ 8 లో ఉన్నాయి. అయితే ప్రతి జట్టు మూడు మ్యాచ్ లు ఆడనుండగా... ఇండియా మరియు శ్రీలంక లు రెండు మ్యాచ్ లు పూర్తి చేసుకున్నాయి. మిగిలిన పాక్ మరియు ఆఫ్ఘన్ లు చెరో మ్యాచ్ ఆడాయి.
ఇండియా మాత్రం రెండూ ఓడిపోయి ఫైనల్ ఆశలను క్లిష్టం చేసుకుంది. ఇక లంక మాత్రం రెండు మ్యాచ్ లలోనూ అద్భుతంగా ఆడి ఫైనల్ కు చేరువైంది. కాగా కొన్ని సమీకరణాలు  ఇండియాను ఫైనల్ కు చేర్చగలవని ఇంకా అభిమానులు నమ్ముతున్నారు మరియు అలాగే జరగాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా మొదటి స్టెప్ గా ఈ రోజు జరగనున్న పాక్ మరియు ఆఫ్ఘన్ మ్యాచ్ లో... పాకిస్తాన్ ఓటమి చెందాలి. మళ్ళీ తర్వాత జరగబోయే శ్రీలంక పాక్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోవాలి. ఇండియా ఆఫ్గనిస్తాన్ ను భారీ తేడాతో ఓడిస్తే... ఒక్కో మ్యాచ్ గెలిచినా ఇండియా పాక్ లలో ఎక్కువ రన్ రేట్ ఉన్న జట్టు శ్రీలంక తో తుది సమరానికి చేరుకుంటుంది.
మరి ఇలా జరుగుతుందా అంటే క్రికెట్ లో ఏదైనా సాధ్యమే.. మరి చూద్దాం ఆఫ్గనిస్తాన్ పాక్ ను ఓడించి ఇండియా కు మార్గం సుగమం చేస్తుందా ? అయితే ముందుగా ఆఫ్గనిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని పాక్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చెయ్యాలి. అప్పుడే గెలవడానికి ఈజీ అవుతుంది... ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ టాస్ మరియు మ్యాచ్ రెండూ గెలవాలని కోరుకుందాం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: