మంచిమాట: ఇతరులను నిర్దోషిగా చూపించే ముందు వారి గురించి తెలుసుకోవాలి..!!
విజయేంద్రుడి ఆస్థానంలో ప్రముఖ కవి దివాకరుడు వుండేవాడు.. ఓసారి మంగోల్ రాజు ఆహ్వానం మేరకు దివాకరుడి నేతృత్వంలో..ఒక కవుల బృందం ఆరాధ్య పర్యటనకు వెళ్ళింది. చిన్న వయస్సులోనే దివాకరుడు విజయేంద్రుడి ప్రశంసలు పొందడంతో తమ విదేశీ పర్యటనకు నాయకుడిగా ఉండడం చూసి.. మిగతా కవులకు అతడిపై విపరీతమైన అసూయ కలిగింది.
ఇక దివాకరుడు తన పద్యంలో మంగోల్ రాజును పొగుడుతూ.. పున్నమి చంద్రుడితోనూ విజయేంద్రుడిని నెలవంకతోనూ పోల్చి చెప్పాడు. దివాకరుడు ఆ పోలిక మంగోల్ రాజుకు ఎంతో నచ్చి..ఇక దివాకరుడికి విలువైన వస్తువులను కూడా బహూకరించాడు. కవుల బృందంలోని మిగిలిన వారికి దివాకరుడిపై రోజు రోజుకూ ద్వేషం మరింత పెరిగింది. కొద్ది రోజులకు మంగోల్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి తిరిగి చేరుకుంది..మంగోల్ పర్యటన విశేషాలను ఒక్కొక్కటిగా ఆ బృందం విజయేంద్రుడికి చెబుతున్నాడు.
దివాకరుడు ఏదేమైనా మీ తర్వాతే మంగోల్ రాజు అని అన్నాడు. ఆ మాటలకు మరి మన రాజా వారిని నెలవంక తోనూ మంగోల్ రాజు పున్నమి చంద్రుడుతోనూ పోల్చావే.. అన్నారు మిగతా కవులు అక్కసుగా.. అవును.. అవును.. మంగోల్ రాజు పున్నమి చంద్రుడు అయితే..మన రాజు నెలవంక పున్నమి.. చంద్రుడి వెలుగు ఒక్క రోజే నెలవంక మెల్లమెల్లగా పెరుగుతూ ఉంటుంది. నెలవంక దినదినాభివృద్ధి చెందడం దాని లక్షణం.. విజయేంద్రుడిలా వారి నైజము అలాంటిదే అందుకే అలా చెప్పా, మీరు భావిస్తున్నట్లు మన రాజు గారిని తక్కువ చేసి చెప్పలేదు నేను అన్నాడు దివాకరుడు.
దివాకరుడి మాటలతో విజయేంద్రుడి మనసు ఉప్పొంగిపోయింది. విలువైన కానుకలు ఇచ్చి దివాకరుడిని పొగడ్తల్లో ముంచెత్తడంతో పాటు మిగతా కవులను కూడా మందలించాడు. అసూయతో దివాకరుడిని రాజు ముందు దోషిగా నిలబెట్టాలనుకొని చూసిన కవులు పరాభవం పాలైనందుకు సిగ్గుతో తలదించుకున్నారు కవులు.