మహేష్ బాబు సినీ కెరియర్ లోనే ఒక్కడు మూవీకి ఒక ప్రత్యేకత ఉంది.. ఈ సినిమా కోసం ఇప్పటివరకు ఎవరు చేయని హార్డ్ వర్క్ తో పాటు నిర్మాత కూడా చార్మినార్ వంటి భారీ సెట్ ని వేసి సంచలనం సృష్టించారు. అయితే ఒక్కడు సినిమాకి ముందు అనుకున్న హీరో ఎవరు.. ఈ సినిమా మహేష్ బాబు కి ఎలా కలిసి వచ్చింది? సంక్రాంతి బరిలో నిలిచి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం.మహేష్ బాబు హీరోగా భూమిక హీరోయిన్ గా..గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఒక్కడు.. కబడ్డీ నేపథ్యంలో హీరోయిన్ ని విలన్ నుండి కాపాడే సన్నివేశాలతో చివరికి హీరోయిన్ కోసం కబడ్డీ ఆటలో మహేష్ బాబు విలన్ ప్రకాష్ రాజ్ ఇద్దరు పోటీ పడడం వంటివి సినిమాకి మంచి హైప్ ని ఇచ్చాయి. అయితే ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది చార్మినార్ సెట్.. అయితే ఈ సినిమా చూసిన చాలామంది నిజమైన చార్మినార్ దగ్గరనే తీశారు అని అనుకుంటారు.కానీ అది నిజం కాదు.
ఈ మూవీ నిర్మాత ఎమ్మెస్ రాజు చార్మినార్ సెట్ ని దాదాపు కోటి 70 లక్షల ఖర్చు చేసి వేయించారు. సేమ్ చార్మినార్ ఎలా ఉందో అలాంటి సెట్ వేయించడం కోసం ఆయన భారీ మొత్తంలో ఖర్చు పెట్టారు. అలాగే చార్మినార్ చుట్టూ ఉండే దుకాణాలు వంటి వాటిని కూడా సెట్ వేయించారు. ఇక ఈ చార్మినార్ సెట్ కోసం హైదరాబాద్ శివార్లలోని రామానాయుడు పది ఎకరాల పొలంలో ఐదు ఎకరాల లో చార్మినార్ సెట్ వేయించాడు. అలా ఈ సినిమా కర్నూల్, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకొని దాదాపు 14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే మహేష్ బాబుతో ఈ సినిమా తీయడం కంటే ముందు డైరెక్టర్ వేరే హీరోని అనుకున్నారట. కానీ అది కుదరలేదు. చివరిగా రాజకుమారుడు సినిమా సమయంలో మహేష్ ని చూసి తన సినిమాలో హీరోగా ఫిక్స్ చేసుకున్నాడు డైరెక్టర్ గుణశేఖర్. ఇక ఈ సినిమా విడుదలయ్యే సమయంలో మహేష్ పని గోవిందా అని ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది మాట్లాడుకున్నారు.ఎందుకంటే ఈ సినిమా కంటే ముందు డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన చిరంజీవి మృగరాజు సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.
అలాగే ఒక్కడు సినిమాకు నిర్మాతగా చేసిన ఎమ్మెస్ రాజు దేవి పుత్రుడు మూవీ యావరేజ్ గా నిలిచింది. దాంతో డిజాస్టర్ తీసిన డైరెక్టర్ తోయావరేజ్ సినిమా తెరకెక్కించిన నిర్మాతతో మహేష్ బాబు ఒక్కడు సినిమా చేస్తున్నాడు. మహేష్ పని గోవిందా అంటూ చాలామంది మాట్లాడుకున్నారు. కానీ తీరా సినిమా విడుదలయ్యాక బాక్సాఫీస్ ని షేక్ చేసింది.అలా మహేష్ బాబు ఒక్కడు మూవీ భారీ అంచనాలతో జనవరి 15,2003లో విడుదలై బాక్సాఫీస్ ని షేక్ చేసింది.. దాంతో అప్పటివరకు మహేష్ బాబు కెరీర్ లో రాజకుమారుడు, మురారి వంటి హిట్స్ ని పక్కనపెట్టి ఒక్కడు మూవీ మహేష్ బాబు సినీ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ గా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకి మాస్,యాక్షన్ సినిమాల్లో కూడా హీరోగా అవకాశాలు వచ్చాయి. అలా ఒక్కడు మూవీ మహేష్ బాబు కెరీర్ ని మార్చేసింది అని చెప్పుకోవచ్చు. కేవలం మహేష్ బాబు మాత్రమే కాదు హీరోయిన్ భూమిక కూడా ఒక్కడు సినిమా మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది.ఆ తర్వాత భూమికకు తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చాయి.