' డాకు మహారాజ్ ' ఐదు సీన్లు చాలు... థియేట‌ర్ల‌లో బాల‌య్య‌ ద‌బిడి దిబిడే...!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

గాడ్ ఆఫ్ మాసేస్ నందమూరి నzసింహ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్‌. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు కొల్లి బాబి డైరెక్ట్ చేస్తూ ఉండడంతో ప్రేక్షకులు అంచనాలు క్రియేట్ అయ్యాయి. బాలయ్య ఇప్పటికే మూడు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నారు. అఖండ - వీర సింహారెడ్డి - భగవంత్‌ కేసరి మూడు సూపర్ హిట్లు అయ్యాయి. దీంతో డాకు మహారాజ్ సినిమా మీద ఫ్రీ రిలీజ్ మామూలుగా లేదు. సంక్రాంతి కానుకగా జనవరి 12న బాలయ్య సినిమా థియేటర్లలోకి దిగుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసేసింది. తాజ గా ఈ సినిమా నుంచి న్యూ ఇయర్ కానుక గా మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేక‌ర్స్‌.

ఇక సినిమాలోని మూడో సింగల్ సాంగ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. ఈ సినిమాలో మూడో సింగిల్ సాంగ్ గా దబిడి దిబిడి అనే పాట జనవరి 2 న రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు అదిరిపోయి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పాటలో బాలయ్యతో పాటు బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శీ రౌతేలా తో కలిసి స్టెప్పులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో వ‌చ్చే ఓ ఐదు బ్లాక్స్ మాత్రం అద‌ర‌గొట్టేస్తాయ‌ట‌. ఈ ఐదు సీన్ల‌కే థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు మెస్మ‌రైజ్ అయిపోతార‌ని నిర్మాత వంశీ చెప్పారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్‌ విలన్ పాత్రలో నటిస్తుండగా .. ప్రగ్య జైశ్వాల్ - శ్రద్ధ శ్రీనాథ్ - చాందిని చౌదరి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థ‌మ‌న్ ఎస్ ఎస్‌ సంగీతం అందిస్తూ ఉండగా .. సితార ఎంటర్టైన్మెంట్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ - త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: