దిల్ రాజు కాదు... డీల్ రాజు... బీఆర్ఎస్ విమర్శలు...!
తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ .. ప్రముఖ నిర్మాత దిల్ రాజు రాజకీయంలో కూరుకు పోతున్నారు. ఆయన ప్రభుత్వం ఇచ్చిన పదవి తీసుకోవడంతో కాంగ్రెస్ నేతగా అనుకోకుండా మారిపోయారు. తనకు తెలియకుండానే రాజకీయాల్లో కి వచ్చేసినట్లు అయింది. అదే సమయంలో చిత్ర పరిశ్రమకు పెద్ద అనే హోదాను రేవంత్ ఆయనకు అప్పగించారు. తెలంగాణ ప్రభుత్వాని కి సంబంధించి చిత్ర పరిశ్రమ కోసం ఏదైనా మాట్లాడాలి .. అంటే ఇక దిల్ రాజు ద్వారానే సాధ్యమవుతుంది. ఇది బిఆర్ఎస్ నేతలు ఆయన ను టార్గెట్ చేయడానికి కారణం అవుతుంది. చిత్ర పరిశ్రమతో రాజకీయాలు చేయవద్దని కేటీఆర్ కు దిల్ రాజు కౌంటర్ ఇచ్చిన వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఆయన దిల్ రాజు కాదని డీల్ రాజు అని బిఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు.
అల్లు అర్జున్ వ్యవహారంలో ఆయన డీల్ చేశారని ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు. దిల్ రాజు తన పని తాను చూసుకోకుండా కాంగ్రెస్ పార్టీ తొత్తులా వ్యవహరిస్తున్నారని గతంలో కొండా సురేఖ .. నాగార్జున .. కేటీఆర్ పై వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు ? స్పందించలేదని శ్రీనివాస్ ప్రశ్నించారు. దిల్ రాజు ఇక మొహమాట పడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఆయన ఇంకా పూర్తిస్థాయి రాజకీయ నేత అయితే కాదు .. సినిమా పరిశ్రమకు సంబంధించి అయితేనే ఆయన స్పందిస్తారు .. కానీ బీఆర్ఎస్ నేతలు తనని వ్యక్తిగతంగా విమర్శిస్తే రాజకీయం గా టార్గెట్ చేస్తే స్పందించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ సినీ పరిశ్రమ ను టార్గెట్ చేస్తే అలాగే సినీ పరిశ్రమను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే మాత్రం వెంటనే దిల్ రాజు రెస్పాన్స్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.