బాలీవుడ్ ఇండస్ట్రీపై శంకర్ షాకింగ్ కామెంట్స్.. అనురాగ్ కశ్యప్ కౌంటర్ ఇదే!
గతంతో పోల్చి చూస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో పరిస్థితి చాలా మారిందని శంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు సినిమాను వ్యాపారంలా చూస్తున్నారని అందువల్ల వాళ్లు మేకింగ్ ను పూర్తిస్థాయిలో ఆస్వాదించడం లేదని శంకర్ అన్నారు. గేమ్ ఛేంజర్ యూఎస్ ఈవెంట్ లో భాగంగా శంకర్ ఈ కామెంట్లు చేయడం జరిగింది. ఈ కామెంట్ల గురించి అనురాగ్ మాట్లాడుతూ ప్రేక్షకులు రీల్స్ కు అలవాటు పడ్డారని చెప్పారు.
ప్రతి విషయం గురించి తక్కువ సమయంలోనే తెలుసుకోవాలని ప్రేక్షకులు భావిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. శంకర్ ఎందుకు అలా మాట్లాడారో అర్థం కావడం లేదని గేమ్ ఛేంజర్ మూవీ విడుదలైన తర్వాత ఆయన మాటలు అర్థమవుతాయేమో చూడలని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు. ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సినిమాలను తెరకెక్కిస్తే ఫిల్మ్ మేకర్ పతనం మొదలైనట్లేనని ఆయన తెలిపారు.
తాను సినిమాలను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీయాలని ప్రయత్నిస్తానని ఆయన పేర్కొన్నారు. అనురాగ్ కామెంట్ల గురించి శంకర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. మరోవైపు గేమ్ ఛేంజర్ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదలవుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. డైరెక్టర్ శంకర్ కు గేమ్ ఛేంజర్ తో పూర్వ వైభవం రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. గేమ్ ఛేంజర్ ఒకే ఒక్కడు, భారతీయుడు సినిమాలను గుర్తు చేసేలా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.