అల్లు అర్జున్ కంటే ముందే జైలుకు వెళ్లాల్సిన అనుష్క.. ఆ సినిమా విషయంలో అంత రాద్ధాంతం జరిగిందా..?
అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియా ఓ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అల్లు అర్జున్ నే కాదు చాలా మంది స్టార్స్ పలు లీగల్ కేసుల్లో ఇరుక్కోవాల్సి ఉన్నింది. కానీ వాళ్ళు పలుకుబడితో ఆ కేసు నుంచి తప్పించుకున్నారట. మరి ముఖ్యంగా హీరోయిన్ అనుష్క కూడా ఓ సినిమా షూటింగ్ విషయంలో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వరకు వచ్చిందట. ఆ సినిమా మరేదో కాదు "బలాదూర్". బలాదూర్ సినిమా షూటింగ్ టైంలో అనుష్క పడవలో నుంచి రవితేజ డూప్ అయిన వ్యక్తిని తోసే మూమెంట్లో నిజంగానే ఆయనను బై మిస్టేక్ గా తోసేస్తుంది.
ఆయన చనిపోయాడు అంటూ కూడా అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి . ఆ మూమెంట్లో అనుష్క పై కేసు పెట్టాలి అని డిసైడ్ అయ్యారట ఆ కుటుంబ సభ్యులు . కానీ అనుష్క ముందే ఆ విషయంలో మంచితనం చాటుకోవడంతో సేఫ్ గా ఆ కేసు నుంచి తెలివితేటలతో తప్పించుకున్నింది అంటూ అప్పట్లో బాగా వార్తలు వైరల్ అయ్యాయి. ఆ టైంలో అనుష్క తప్పించుకుంది లేకపోతే అల్లు అర్జున్ కన్నా ముందే జైలుకు వెళ్లి ఉండేది అంటూ ఘాటు ఘాటు గా ట్రోల్ చేస్తున్నారు జనాలు..!