మంచిమాట: స్వార్థం వల్ల మనిషికి ఒరిగేదేమీ లేదు..!

Divya
రాము, సోము అనే ఇద్దరు అబ్బాయిలు ఇరుగుపొరుగు ఇళ్లలో ఉండేవారు. ఇద్దరూ ఒకే స్కూల్లో ,ఒకే క్లాసులో చదువుతున్నారు. అయినా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడలేదు. రాము ఎంతో బుద్ధిమంతుడు.. తెలివైనవాడు. చక్కగా బడికి వెళ్లి బాగా చదువుకునేవాడు. మంచి మార్కులు కూడా తెచ్చుకునే వాడు. అంతేకాదు ఉపాధ్యాయుల ప్రశంసలు కూడా పొందేవాడు రాము.
ఇక సోము ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. బడికి సరిగ్గా వెళ్లేవాడు కాదు. పాఠాలు చదివేవాడు కాదు. ఎప్పుడు అక్కడ ఇక్కడ గోలీలు, బొంగరాలు ఆడుకుంటూ కాలం వృధా చేసేవాడు. ఇంట్లో తల్లిదండ్రులు , బడిలో ఉపాధ్యాయులు  కూడా సోమునీ కోప్పడేవారు.
"రాముని చూసి బుద్ధి తెచ్చుకో. వాడు ఎంత బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్నాడో చూడు"అంటూ రాము ని మెచ్చుకొని సోమును కోపగించుకొనేవారు.
 
దాంతో సోముకి.. రాము మీద ఆగ్రహం ఏర్పడింది. రామును ఎలాగైనా సరే  దెబ్బతీయాలను కున్నాడు. పరీక్షలు దగ్గరపడుతున్న సమయంలో,  ఎవ్వరూ చూడకుండా రాము పుస్తకాలన్నీ బావి లో పడేశాడు సోము..పుస్తకాలు పోయినందుకు రాము బాధపడ్డాడు. వాడి తిక్కకుదిరిందనుకున్నాడు సోము.
పరీక్షలు వచ్చాయి. రాము చక్కగా పరీక్షలు రాశాడు. సోము సరిగా రాయలేక పోయాడు. పరీక్ష ఫలితాలు వచ్చాయి. రాము ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. సోము ఫెయిల్ అయ్యాడు.
సోము.. రాము "నేను ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకునే వాడిని, నోట్సులు రాసుకునే వాడిని.. అవసరమైన పద్యాలు, సమాధానాలు అన్ని కంఠస్థం చేసుకున్నాను. అందుకే బుక్స్ పోయినా రాయగలిగాను. అని చెప్పాడు.
తను చేసిన తప్పు తెలుసుకోని పశ్చాత్తాప పడ్డాడు. సోము ..ఆ రోజు నుంచి ఏ రోజు పాఠాలు ఆ రోజే చదవడం ప్రారంభించాడు. ఈ పిల్లలు మాత్రమే ఉదాహరణ కాదు జీవితంలో ఏదైనా సరే ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా నేర్చుకో గలగాలి.. అప్పుడే జీవితంలో ఎప్పుడు ఆపద కలిగినా నేర్చుకున్నది మనకు ఉపయోగ పడుతుంది.. ఇక విద్య ఇతరులకు ఇస్తే తరిగిపోదు అన్న విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అందుకే ఇచ్చే కొద్దీ తరిగేది డబ్బు.. ఇక ప్రతి ఒక్కరికి పంచడం వల్ల పెరిగేది విద్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: