మంచిమాట: నీవు ఇతరులకు సాయం చేస్తే , దేవుడు నీకు సాయం చేస్తాడు.

Divya

అనగనగా ఒక ఊర్లో రాము , సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇక వీరిలో రాము కుంటివాడు. సోము గ్రుడ్డివాడు. ఒక రోజున రాము, సోము తో ఇలా  అంటున్నాడు.." ఈ పక్క ఊర్లో ఏదో జాతర జరుగుతున్నదట. ఆ జాతర చూడడానికి చాలా మంది భక్తులు, ధనవంతులు అక్కడికి వస్తారు. ఇక మనం కూడా అక్కడికి వెళ్తే, ధర్మం రూపేనా మనకు కొంత డబ్బు వస్తుంది" అన్నాడు. అందుకు సమాధానంగా సోము.." ఆ  ఊరు ఏమో చాలా దూరంలో ఉంది. నీవు కుంటి వాడివి, నేను గ్రుడ్డివాడిని. మనం ఇద్దరం కలిసి అంతదూరం వెల్లేదెలా" అని అడిగాడు.

అప్పుడు రాము నీవేమీ దిగులుపడకు. మనం అక్కడికి చేరుకోవడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నీవు  గ్రుడ్డివాడి వైననూ నడవగలవు, నేను కుంటి వాడినైననూ చూడగలను. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సులభంగా ఆ ఊరికి చేరుకోవచ్చు. నన్ను నీ భుజం మీద కూర్చోపెట్టుకుని నీవు నడుస్తూ ఉంటే, నీకు నేను దారి చూపిస్తాను అంటూ రామూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సలహా సోముకి కూడా బాగానే నచ్చింది.

ఇక ఇద్దరూ ఇష్టపడి ఆ ప్రయాణం మొదలుపెట్టారు. ఏదోలాగా కష్టపడుతూ, ఆ జాతర  జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. ఇక వారి అదృష్టం కొద్దీ , వారి దయనీయ పరిస్థితిని చూసి భక్తులు, ధనవంతులు కూడా వారికి తోచిన సహాయంగా  వీరికి సహాయం చేశారు. అనుకున్న విధంగానే వీరికి ఎక్కువ డబ్బు పోగయింది. ఇక సంతోషంగా వచ్చిన పద్ధతిలోనే ఇంటికి చేరుకున్నారు..

కాబట్టి ప్రస్తుతం కరోనా సమయంలో కూడా చాలామంది సహాయం కూడా అందలేని స్థితిలో ఎంతోమంది ఉన్నారు. ప్రభుత్వాలు కూడా అందరికీ దూరంగా ఉండమని చెప్తున్నారే కానీ సహాయం చేయవద్దని మాత్రం చెప్పడం లేదు. అందుకే ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి మీకు తోచిన సహాయం చేయడం వల్ల భగవంతుడు మీకు ఎప్పుడూ కష్టాల్లో తోడుగా ఉంటాడు. అందుకే వీలైనంత వరకూ ఇతరులకు మీ దగ్గర ఉన్నంతలో సహాయం చేయడానికి పాటుపడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: