మంచిమాట: జీవితంలో ఏది సులభంగా దొరకదు.. ప్రయత్నిస్తే ఏది కష్టం కాదు!

Durga Writes

నేటి మంచిమాట.. జీవితంలో ఏది సులభంగా దొరకదు.. ప్రయత్నిస్తే ఏది కష్టం కాదు! అవును.. ప్రతిదీ కష్టపడితేనే దొరుకుతుంది. ఏది ఉచితంగా దొరకదు. అన్ని కష్టపడాలి. చిన్నప్పటి నుండి కస్టపడి చదివితేనే 15 ఏళ్లకు ఫలితం లభిస్తుంది. అలా కాదు అని కస్టపడి చదవలిసిన సమయంలో మనకు నచ్చినట్టు అల్లరి చిల్లరగా ఎంజాయ్ చేస్తే ఆ మరో నలభై ఏళ్ళు ఎండలో చమటలు వచ్చేలా కష్టపడాలి. అంత కష్టపడిన సరే నీ పిల్లలకు మంచి జీవితం ఇవ్వలేవు. 

 

అదే నీ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలి అంటే నువ్వు కష్టపడాలి. అదే చిన్న వయసులోనే కాస్త కష్టపడితే ఖచ్చితంగా మంచి జీవితం లభిస్తుంది. మంచి జీవితానికి పునాది కష్టమే. కష్టం లేకుండా మంచి నీరు కూడా రాదూ ఈ కాలంలో. కష్టం చేస్తేనే మంచి జీవితం లభిస్తుంది. అలా కాదు అని కష్టపడకపోతే ఏమి మిగలదు. జీవితం ఆనందంగా ఉండాలి అంటే కష్టపడాలి. ఇది కలియుగం. ఏది అంత ఈజీగా ఉండదు. జీవితం అంటేనే కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా స్వీకరిస్తే మంచి ఫలితం ఉంటుంది. 

 

అంతేకాదు.. జీవితం అన్నాక కాస్త కష్టం ఉండాలి.. అప్పుడే సుఖాన్ని పొందగలరు. కష్టం లేకుండా ఏమి ఆశించిన ఫలితం ఉండదు. ఫలితం ఉండాలి అంటే కష్టపడాలి. ఏది ఊరికే రాదు.. వచ్చిన ఎక్కువ రోజులు ఉండదు. ఏదైనా రావాలి అంటే కష్టపడాలి. కష్టపడితేనే మంచి జీవితం లభిస్తుంది. ఓడిపోయినా మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. అప్పుడే జీవితం అందంగా ఆనందంగా ఉంటుంది.                                                          

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: