మంచిమాట: నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు.. నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది!

Durga Writes

నేటి మంచిమాట.. నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు.. నిరంతరం శ్రమిస్తేనే విజయం నిన్ను వరిస్తుంది. అవును.. కొంతమంది నిలబడి మాటలు చెప్తుంటారు.. వాళ్లకు ఎప్పుడు అర్థం అవుతుందో కేవలం నిలబడి ఆలోచిస్తే విజయాలు రావు అని.. ఏదైనా మనం కష్టపడితేనే విజయం వస్తుంది అనేది వాళ్ళకు ఎప్పుడు తెలుస్తుందో మరి. 

 

కొందరు అయితే మాటలు మీద మాటలు చెప్తుంటారు కానీ పనులు మాత్రం చెయ్యరు. అక్కడే ఉంటాయి. మాటలతో కాలం గడపాలి అనుకుంటారు.. కానీ అన్ని సార్లు వాళ్ళు అనుకున్నట్టు ఆ కాలం సాఫీగా సాగదు. కొన్ని సార్లు సమస్యల్లో పడుతారు. అందుకే.. కేవలం మాటలు కాకుండా పనులు చేస్తే జీవితంలో ముందడుగు వేస్తారు. 

 

అందుకే మాటలు కాకుండా పని చేస్తే.. శ్రమిస్తే.. ఈరోజు కాకపోయినా భవిష్యత్తులో ఏదో ఒక రోజు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది.. అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. అందుకే నిలబడి ఆలోచిస్తే ఎలాంటి అద్భుతాలు జరగవు అని తెలుసుకొని.. నిరంతరం శ్రమిస్తే విజయం వరిస్తుంది అనేది తెలుసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: