కేసీఆర్ - స్మితా సబర్వాల్ లపై కథనం..

Chakravarthi Kalyan
స్మితా సబర్వాల్.. చిన్న వయసులోనే ప్రతిభావంతురాలైన ఐఏఎస్ ఆఫీసర్ గా గుర్తింపు తెచ్చుకున్న అధికారిణి. 2001 కేడర్ కు చెందిన ఈ యువ అధికారిణి తన ప్రతిభతో పీఎం  అవార్డు కూడా అందుకున్నారు. మెదక్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్ గా పనిచేసిన సమయంలో ఈమె చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వ అవార్డులు, గుర్తింపు దక్కాయి. ప్రధానంగా అమ్మలాలన అన్న కార్యక్రమానికి అప్పటి ప్రధాని నుంచి ప్రశంసలు దక్కాయి. 

స్మితాసబర్వాల్ మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం పట్ల సానుభూతితో ఉన్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు తెలంగాణ అమరవీరుల సంస్మరణ సభలో ఆమె కన్నీళ్లు పెట్టేశారు. కొడుకులను కోల్పోయిన తల్లులను అక్కున చేర్చుకుని ఓదార్చి తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకున్నారు. ఇంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్మితాసబర్వాల్ ను కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే తన సీఎంఓలోకి తీసుకున్నారు. కీలకమైన బాధ్యతలు అప్పగించారు. 

స్మితా సబర్వాల్.. అందమే శాపమా.. ?


ఐతే.. అలాంటి స్మితా సబర్వాల్ పై హిందూ గ్రూపునకు చెందిన ఔట్ లుక్ వార పత్రిక తన లేటెస్ట్ మ్యాగజైన్లో తీవ్ర అభ్యంతరకరమైన, జుగుప్సాకరమైన కార్టూన్ ప్రచురించి.. తన స్థాయిని తానే దిగజార్చుకుంది. సహజంగా హిందూ గ్రూప్ అన్నా.. ఔట్ లుక్ అన్నా.. పాత్రికేయలోకంగా కాస్త గౌరవం ఉంది. ఇప్పుడీ కార్టూన్ ప్రచురణ ద్వారా ఆ మంచిపేరంతా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది.  

స్మితాసబర్వాల్ స్విమ్ సెక్సీ దుస్తుల్లో  ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తుంటే.. కేసీఆర్ ఆమెపై లైట్లు ఫోకస్ చేస్తున్నట్టుగా కార్టూన్ ప్రచురించారు. ఈ కార్డూన్ ప్రచురణకు ఎలాంటి నేపథ్యమూలేదు.. కేసీఆర్- స్మితాసబర్వాల్ పై ఎలాంటి ఆరోపణలూ లేవు. ఐనా బాధ్యతారాహిత్యంగా ఔట్ లుక్ ప్రచురించిన ఈ కార్టూన్  పట్ల తెలంగాణలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. సర్వత్రా దీనిపై విమర్శలు రావడంతో ఔట్ లుక్ ఆ కార్టూన్ ను తొలగించింది.తనపై అసభ్య కథనం ప్రచురించిన ఔట్‌లుక్ మ్యాగజైన్‌పై స్మితా సబర్వాల్ లీగల్ నోటీసు పంపించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: