ఓడితే పార్టీ కనుమరుగే.. ఏపీలో డూ ఆర్ డై సిచ్యువేషన్?

praveen
మునుపెన్నడు లేని విధంగా ఇప్పుడు ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. గెలుపే లక్ష్యంగా టిడిపి వైసిపి పార్టీలు ముందుకు సాగుతున్నాయి. టిడిపి బిజెపి జనసేన పార్టీలను కలుపుకొని ముందుకు సాగుతుంటే వైసీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. ఇక ఎన్నికలు నేపథ్యంలో పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది అన్న విధంగా విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో గెలిచిన పార్టీదే రాజకీయ జీవం కూడా అని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు.

 ఎందుకంటే ఓడిన పార్టీ కనుమరుగయ్యే  ముప్పు ఉంది అని అనుకుంటున్నారట. అదేంటి ఓడిపోతే పార్టీ కనుమరుకవ్వడం ఏంటి అనుకుంటున్నారు కదా. ప్రస్తుతం రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఓడిపోతే. ఓడిపోతే ఏంటి మళ్లీ పోటీ చేస్తాం గెలుస్తాం అని పార్టీని వీడకుండా ఉండేవారు  కానీ ఇప్పుడు పార్టీ అధికారాన్ని కోల్పోయింది అంటే చాలు అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ అవ్వడానికి సిద్ధమవుతున్నారు అందరూ నేతలు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

 ఇప్పుడు కేంద్రంలో మరోసారి బిజెపి అధికారంలోకి వచ్చి ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారాన్ని చేపట్టిందంటే ఇక వైసిపి ఎమ్మెల్యేలు అందరూ కూడా బిజెపిలో చేరిపోయిన లేదంటే టిడిపి జనసేనలో చేరిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నది అటు విశ్లేషకులు అంచన. ఒకప్పటిలా ఓడిపోయిన జనం తరపున పోరాడి నిలబడే తత్వం రాజకీయ నాయకుల్లో కనిపించడం లేదు అన్నది ఈ రోజుల్లో వినిపిస్తున్న వాదన. ఇక నేటి రోజుల్లో ఎన్నికల వ్యయం కూడా ఇలా ఓడిపోయిన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వెళ్లడానికి ముఖ్య కారణం గా మారిపోయింది.

 మిగతా రాష్ట్రాలలో పరిస్థితి మరోలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఇలాంటి ఫిరాయింపు రాజకీయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.. కోట్లాది రూపాయలను ఎన్నికలలో గెలుపు కోసం వెచ్చించడం.. ఇక ఆ తర్వాత అధికారంలో ఉన్న పార్టీలోకి వలసలు వెళ్లడం.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో నయా ట్రెండ్ గా మారిపోయింది  మరోవైపు అధికారంలోకి వచ్చిన పార్టీ  ప్రతిపక్షం లేకుండా ఉడ్చిపారాయాలని ఆపరేషన్ ఆకర్ష్ కూడా చేపడుతూ ఉండడం  చూస్తూ ఉన్నాం. దీంతో పార్టీ అంటే కరుడు కట్టిన వారు తప్ప మొత్తానికి మొత్తం ఓడిపోయిన పార్టీ నుంచి గెలిచిన పార్టీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలా ఏపీలో గెలిచిన పార్టీ రాజకీయ జీవం పోసుకుంటే.. ఓడిన పార్టీ కనుమరు అయ్యే పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారట. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: