ఇదెక్కడి ట్విస్ట్.. తెలంగాణ బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఏపీ టిడిపి నేత?

praveen
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఎంతలా వేడెక్కాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయా పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ కూడా గెలిపే లక్ష్యంగా ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు. తమన గెలిపిస్తే ఏం చేస్తాము అనే విషయంపై స్పష్టమైన హామీలను కూడా ఇస్తున్నారు. అదే సమయంలో తమ గెలుపు కోసం మద్దతును కూడగట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది నేతలు కేవలం తెలంగాణలోని నాయకులను మాత్రమే కాదు ఇతర రాష్ట్రాలలోని నాయకుల మద్దతు కూడా కూడగట్టుకుంటూ ఉండటం గమనార్హం.

 ఈ క్రమంలోనే చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఏపీ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మద్దతు పలికారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఓటు వేసి ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపించాలి అంటూ పిలుపునిచ్చారు. ఉన్నత విద్యావంతుడు, పలు కంపెనీలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు దేవినేని ఉమ. అందుకే అలాంటి వ్యక్తికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ ఓటర్లను కోరారు   పార్లమెంటులో పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడి ఇక తన పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు రాబట్టగల సమర్థుడు కొండ విశ్వేశ్వర్ రెడ్డి. సేవాభావం నిజాయితీ కలిగిన ప్రజాసేవకుడు అందుకే ఆయనకు మద్దతుగా నిలవాలి అంటూ కోరుతున్నట్లు దేవినేని ఉమా చెప్పుకొచ్చారు.

 అయితే ఏపీలో పోటీకి దూరంగా ఉన్న ఉమామహేశ్వర్ రావు ఇక ఇలా తెలంగాణ బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి కి మద్దతు పలకడం హాట్ టాపిక్ గా మారిపోయింది.  కొండా విశ్వేశ్వర్ రెడ్డి, దేవినేని ఉమా మధ్య ఉన్న మంచి స్నేహబంధం కారణంగానే ఆయన తెలంగాణ ఓటర్లకు ఇలాంటి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు కూడా కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై ఇక విమర్శలు చేయకపోవడం విశేషం. ఇటీవల చేవెళ్ల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంచివాడే కానీ బిజెపికి ఓటు వేస్తే వృధా అవుతుంది అని చెప్పారు తప్ప ఆయనను ఎక్కడ విమర్శించలేదు. ఇలా మిగతా నాయకుల మద్దతు కూడగట్టుకుని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: