వైసీపీ మేనిఫెస్టోపై సామాన్యుల పెదవి విరుపులు.. జగన్ తప్పు చేస్తున్నారా?

Reddy P Rajasekhar
గత కొంతకాలంగా వైసీపీ మేనిఫెస్టోలో రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ ఉంటుందని చాలామంది భావించగా జగన్ మాత్రం మేనిఫెస్టోతో భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. కూటమి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు ధీటుగా సైతం వైసీపీ మేనిఫెస్టో లేకపోవడం గమనార్హం. వైసీపీ మేనిఫెస్టోపై సామాన్యుల నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మేనిఫెస్టో ఆహా ఓహో అనేలా లేదని సామాన్యులు చెబుతున్నారు.
 
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఊరించి ఉసూరుమనిపించారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ ముందుగానే ఈ మేనిఫెస్టోను ప్రకటించి ఉంటే బాగుండేదని ఎన్నికలకు రెండు వారాల ముందు ఇలాంటి హామీలను ప్రకటించి ప్రయోజనం లేదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. మేనిఫెస్టో హామీలను విని చాలా ప్రాంతాలలో వైసీపీ నేతలు సైతం తీవ్రస్థాయిలో నిరాశకు లోనయ్యారని తెలుస్తోంది.
 
కూటమి తల్లికి వందనం స్కీమ్ ద్వారా కుటుంబంలోని పిల్లలందరికీ 15,000 రూపాయలు, అన్నదాత స్కీమ్ ద్వారా 20,000 రూపాయలు, 10 లక్షల రూపాయల వరకు డ్వాక్రా రుణమాఫీ, 4000 రూపాయల వరకు పింఛన్ ఇలా ఏ హామీ తీసుకున్నా వైసీపీపై పైచేయి సాధించేలా ప్రకటనలు చేసింది. వైసీపీ హామీలు కూటమికి పోటీ ఇచ్చేలా లేవని వైఎస్సార్ ఆసరా పథకాన్ని కొనసాగించకపోవడం వల్ల డ్వాక్రా సంఘాల సపోర్ట్ కూడా దక్కదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
2014 ఎన్నికల నాటి పరిస్థితులనే జగన్ ఎదుర్కోనున్నారని ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం కష్టమేనని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్ లో వైసీపీకి అనుకూలంగా పరిస్థితులు మారుతున్న తరుణంలో జగన్ చేతులారా పొలిటికల్ కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీ మేనిఫెస్టోతో కూటమి నేతలు మాత్రం సంతోషంగా ఉన్నారని సమాచారం. 2024 ఎన్నికల్లో కూటమి విజయం సాధించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.  రైతులు, పెన్షనర్లు ఈ హామీలు తమకు ఏ మాత్రం సంతృప్తిగా లేవని వెల్లడిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: