బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన.. ఈ సరి ఏకంగా ఆ స్టార్ హీరో సరసన..!?బాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన రష్మిక మందన.. ఈ సరి ఏకంగా ఆ స్టార్ హీరో సరసన..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలు బిజీగా ఉంది. నార్త్ టు సౌత్ కొరకు ఆమె చేస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా హిట్స్ అందుకుంటున్నాయి. ఇటీవల రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాలో హీరోయిన్గా నటించింది. రష్మిక కాగా ఈ సినిమా కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమాతో తనకి బాలీవుడ్లో మంచి గుర్తింపు లభించింది .అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం అమాంతంగా పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం రష్మిక మందనకి తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో

 కూడా వరుస సినిమాలు చేసే అవకాశం దక్కుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె విక్కీ కౌశల్ నటిస్తున్న భారీ పీరియాడికల్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అయితే తాజాగా ఇప్పుడు రష్మిక మందన బాలీవుడ్ లో మరొక సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సరి ఏకంగా రష్మిక మందన బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేస్తుంది. అయితే సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తమిళ స్టార్

 డైరెక్టర్ మురగదాస్ తో సల్మాన్ ఖాన్ తన నెక్స్ట్ సినిమా చూస్తున్నాడు. కాగా ఆ సినిమాకి సికిందర్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనిలో జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కి జోడిగా రష్మిక మందనాను సెలెక్ట్ చేశారు చిత్రబృందం. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ పిఆర్ తరణ్ ఆదర్శ్ తెలియజేసారు. ఈ న్యూస్ తో రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా సల్మాన్ ఖాన్, మురుగదాస్ ప్రస్తుతం సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. మరి వరుస సక్సెస్ లు అందుకుంటున్న రష్మిక.. తన లక్కీ హ్యాండ్ తో వీరికి సక్సెస్ ని అందించి తన స్టార్‌డమ్ ని మరింత పెంచుకుంటారో లేదో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: