జయలలితకు సుప్రీం కోర్టులో చుక్కెదురు..!!

Edari Rama Krishna

ఒకప్పుడు తమిళుల ఆరాధ్య దైవంగా ఎంజీఆర్ ఉండే వారు ఆయన రాజకీయ వారసత్వంగా వచ్చింది జయలలిత. ఆమె ముఖ్యమంత్రిగా తమిళనాడు ప్రజల్లో సుస్థర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అయితే జయలలిత అక్రమ ఆస్తుల విషయంలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.  ఈ  కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించాల్సిన అవసరం తమిళనాడు ప్రభుత్వానికి లేదని చెప్పింది. అంతేగాక ఆయన ద్వారా కర్ణాటక హైకోర్టులో జయ కేసుపై తాజా వాదనలు వినాల్సిన అవసరం కూడా లేదని పేర్కొంది. భవానీ సింగ్ అనే వ్యక్తిని ప్రాసిక్యూటర్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే నేత అన్బగన్ వేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీం తుది నిర్ణయాన్ని వెల్లడించింది


మాజీ ముఖ్యమంత్రి జయలలిత


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్షపడింది.ప్రస్తుతం జయలలిత బెయిల్ పై చెన్నైలో ఉంటున్నారు.  జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల డీఎంకే అధినేత కరుణానిధి హర్షం వ్యక్తం చేశారు. న్యాయం, నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తాయని మరోసారి రుజువైందని ఆయన అన్నారు.


ఈ కేసు ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుందా అని ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఆయన ఇప్పుడే తాము ఎన్నికల గణాంకాలు వేసుకోవడంలేదని, అయితే, ఇది మాత్రం తమ పార్టీకి పెద్ద విజయమే అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: