ఎడిటోరియ‌ల్: టీడీపీ తో పొత్తు వ‌ద్దు..!

DSP

ఇక టీడీపీ తో పొత్తు పెట్టుకొవ‌ద్ద‌న నిర్ణ‌యానికి వ‌చ్చారు బీజేపీవ‌ర్గాలు. ఎన్నికల సమయంలో కలసికట్టుగా పనిచేసిన బీజేపీ, టీడీపీ మధ్య దూరం అంతకంతకూ పెరిగిపోతోంది. విశాఖలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గసమావేశంలో ఇక టీడీపీ తో పొత్తు స్వ‌స్తి ప‌లకాలని బీజేపీ నేతలు ఓనిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వ‌చ్చినత‌ర్వాత మన పార్టీకి, కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదు. మ‌న వల్లేఅధికారంలోకి వ‌చ్చిన‌ టీడీపీని ఇంకా ప‌ల్లకి లో మోస్తున్నాం. ఆ పార్టీచేస్తున్న త‌ప్పులకు మ‌నం బాధ్యులమవుతున్నాం. వివక్షకు గురవుతున్నాం.ఇకనైనా సొంతంగా ఎదుగుదామ‌ని రాష్ట్ర నేతలు ఆవేదన వ్య‌క్త ప‌రిచారు.


టీడీపీ ప్రభుత్వం వివక్ష చూప‌డంతో


ఇక నేరుగా ప్రజల్లోకి..విశాఖ కేంద్రం గా జ‌రిగిన ఈ సమావేశానికి హాజరైన కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ జగత్ ప్రకాష్ నడ్డాహ‌జ‌ర‌య్యారు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, కావూరి సాంబశివరావు,సీనియర్ నేతలు సోము వీర్రాజు, శాంతారెడ్డిలతోపాటు దాదాపు ప్రధాన నేతలంతాఈ స‌మావేశంలో పాల్గోన్నారు. న‌డ్డా సమక్షంలోనే తీవ్రస్థాయిలో వీరంతాఅసంతృప్తి స్వరం వినిపించారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని యువ నేతలు కూడాబలపరిచారు. టీడీపీ ప్రభుత్వం వివక్ష చూప‌డంతో ఇక నేరుగా ప్రజల్లోకివెళ్లాలని బీజేపీ నిర్ణయించింది.


టీడీపీ విమర్శలను తిప్పికొట్టాలని బీజేపీ


టీడీపీ విమర్శలను తిప్పికొట్టాలని బీజేపీ నిర్ణ‌యంవాస్తవానికి ఎన్నికల సమయంలో బీజేపీకి ఏపీ లో పెద్దగా కేడర్ బలం లేదు.కేవలం అక్కడక్కడా కార్యక్రమాలు చేయడం మినహా పార్టీ నిర్మాణం బలంగా లేదు.ఎన్నికల అనంతరం కేంద్రంలో అధికారంలోకి రావడంతో జిల్లాలో పలువురు నేతలుబీజేపీ వైపు చూడడం ప్రారంభించారు. ఇందులో భాగంగా సీనియర్ నేతలు బీజేపీలోచేరారు. దీంతో బీజేపీ క్రమంగా బలం పెరుగుతూ వ‌చ్చింది. ఈ నేపథ్యంలోనేరాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయ‌కులు అటు రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా స్థాయి నేతలు పరోక్షంగావిమర్శలు చేస్తూ వ‌స్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రివెంకయ్యనాయుడు రాష్ట్ర ప్రజలను వంచించారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదాఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి...అధికారంలోకి వచ్చాక అమలుకు చర్యలుతీసుకోలేదన్నారు. దీంతో టీడీపీ వైఖరి బీజేపీ నేతలకు ఆగ్రహం తెప్పించింది.టీడీపీ నేతల వైఖరిపై కిందిస్థాయి కార్యకర్తల మనోభావాలను రాష్ట్ర నేతలకుజిల్లాస్థాయి బీజేపీ నేతలు వివరించారు. ఈ నేపథ్యంలో టీడీపీ విమర్శలనుఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని జిల్లా బీజేపీ నేతలకు రాష్ట్ర బీజేపీనుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి.

 

బీజేపీ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్


మా జోలికి వస్తే ఖబడ్డార్రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో టీడీపీ పై బీజేపీ నేతలు విమర్శనస్త్రాలను ఎక్కుపెట్టడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే తాజాగాపాణ్యంలో జరిగిన సమావేశంలో బీజేపీ సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డితీవ్ర స్థాయిలో మండిపడ్డారని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.‘టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని.. తమ జోలికివస్తే ఖబడ్డార్’ అని పాణ్యంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలోతీవ్రస్థాయిలో ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి 24 గంటల విద్యుత్ పథకంలోక్రెడిట్ అంతా కేంద్రానిదేనని ఆయన తేల్చి చెప్పారు.


జనసంపర్క్ మహాసంపర్క్ అభియాన్


ఒంటరి పోరుకు సిద్దం మ‌రోవైపు కర్నూలు కార్పొరేషన్‌కు ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉంది. టీడీపీ-బీజేపీల మధ్య ముదురుతున్న పోరు చివరకు కర్నూలు కార్పొరేషన్ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు చిత్తు అయ్యేందుకు దారితీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి కర్నూలు నగరపాలకసంస్థ పరిధిలో ముస్లింలు, క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్నందున.. బీజేపీతో పొత్తు నష్టం చేకూరుస్తుందనేది జిల్లా టీడీపీ నేతల అంతర్గత అభిప్రాయం.అందువల్లే కార్పొరేషన్ ఎన్నికల వరకు బీజేపీ పై విమర్శలుకురిపిస్తున్నారన్న అభిప్రాయమూ ఉంది. మొత్తం మీద రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు కష్టమేననేది ఇరు పార్టీ నేతలుఅంతర్గత సంభాషణల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ప్రత్యేక హోదా తప్ప.. మంత్రి నడ్డా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తప్ప ఎలాంటి సాయాన్నైనా చేసేందుకు కేంద్రంసిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి జేపీ నడ్డా తెలిపారు. ఏపీలో ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ వంటి ఉన్నతవిద్యా సంస్థలను కేంద్రం నెలకొల్పుతుందన్నారు. ‘ఏపీకి ప్రత్యేక హోదా అనేపదాన్ని వాడొద్దు. దీంతో నిమిత్తం లేకుండా.. రాష్ట్రానికి అన్ని నిధులూఇస్తాం’ అని నడ్డా పేర్కొన్నారు. యూపీ, గుజరాత్, రాజస్థాన్‌లలో మాదిరిగా ఏపీలోనూ బీజేపీ ఎదగాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు,రాష్ట్రానికి ఇస్తున్న నిధులపై విస్తృత స్థాయి ప్రచారం చేయాలనితీర్మానించారు. ఈ నెలాఖరు నాటికి సభ్యత్వ నమోదు పూర్తిచేసి, ఆ తరువాత ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ‘జనసంపర్క్ మహాసంపర్క్ అభియాన్’అనే పేరిట చేపట్టే ఈ కార్యక్రమానికి పురందేశ్వరిని కన్వీనర్‌గా నియమించారు.


కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తూ.. తమ పార్టీపైనే నిందలు వేస్తేసహించేది లేదని ఆ పార్టీ కిందిస్థాయి నేతలు కూడా మండిపడుతున్నారు.మొత్తానికి రెండు పార్టీల మధ్య ముదురుతున్న మాటల యుద్ధం చివరకు పొత్తువిచ్ఛిన్నానికి దారితీసే అవకాశం ఉందని రాజకీయ మేధావులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: