కేసీఆర్ చెవిలో ఇక ప్రతిక్షణం రాజకీయ బాజా మోతలే!

తెలుగునేల నలుచెరగులా వినపడే ఒకే ఒక్క బర్నింగ్ టాపిక్ 'హుజూర్ నగర్ అసెంబ్లీకి జరిగే ఉపఎన్నికపైనే చర్చ నడుస్తోంది. టీ-పిసిసి అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఉపేన్నికలు అనివార్యం అయ్యాయి. అయితే హుజూర్ నగర్ లో "గులాబీ జెండా" పాతేద్దామని కలకు కంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన తనకే స్వంతమైన ఆలోచనలకు వ్యూహాలకు పదునుపెట్టారు.



టిఎస్-ఆర్టీసీ అనే నిప్పుతో తలగోక్కున్న కేసీఆర్ కు గట్టిగా బుద్ది చెప్పకపోతే తప్పదన్న ఆలోచనలో ఉన్న తెలంగాణా కాంగ్రెస్ నేతలంతా విభేదాలు మరచి ఒక్కతాటి పైకి రాగా, ఇప్పుడు కేసీఆర్ కే గుణపాఠం తప్పదా? ఈ విషయంలో ఆసక్తి కర రాజకీయ సామాజిక విశ్లేషణలు కొన సాగుతున్నాయి. హుజూర్ నగర్ పై ఉత్తమ్ కుటుంబానికి మంచి పట్టుంది. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా స్వయానా ఉత్తమ్ కుమార్ సతీమణే పోటీకి దిగారు.


అటు టీఆర్ఎస్ తరఫున వడబోతల మీద వడబోతల తరవాత కేసీఆర్, కాస్తంత వ్యూత్మకంగా గట్టి అభ్యర్థినే ఎన్నికల రణరంగంలోకి దింపారు. మరో వైపు హుజూర్ నగర్ ఉపఎన్నిక ద్వారా తన సత్తా చాటుదామంటూ బీజేపీ కూడా పక్కా వ్యూహాలే రచించింది. స్థానికంగా మంచి పేరున్న అభ్యర్థిని కమలనాథులు రంగంలోకి దించారు. ఇదే అదనుగా బీజేపీ కూడా తన ప్రయత్నాలను తాను మొదలెట్టింది. ప్రజల్లో బలమైన పేరు ప్రతిష్టలున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందని ప్రజల్లో పలుకుబడి ఉన్న వెనుక బడిన వర్గాలకు చెందిన వైద్య విద్యావంతుణ్ణి నిలబెట్టింది. అటు కాంగ్రెస్ అభ్యర్ధి ఇటు టీఅరెస్ అభ్యర్ధి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే. అయితే హుజూర్ నగర్ లో ఎప్పుడూ రెడ్లే గెలవాలా అన్న వారికి వెనుకబడిన వర్గాలనుండి సవాల్ ఇలా ఎదురైంది. 
 
ఇతర పార్టీలవ్యూహాలు ఎలాఉన్నా, కేసీఆర్ శైలివ్యూహాల ముందు తేలిపోతాయన్న బలమైన వాదన వినబడుతున్నా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్న ఐక్యతారాగాన్ని చూస్తుంటే  కేసీఆర్ వ్యూహాలన్నీ పటాపంచలై, చిత్తైపోక తప్పదని విశ్లేషకుల వాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ ఇంటర్మీడియట్ విద్యార్ధుల పలితాల ప్రకటనతోనే తన మరియు తన పార్టీ ప్రతిష్ట కోల్పోయారు. దానికి తోడు ఆయన చట్టాన్ని, విధానాలను గౌరవించరని ఆయన కనీసం ప్రజావేదికైన సచివాలయానికి కూడా  రాకుండా, ₹ 150 కోట్ల ప్రజాధనం వెచ్చించి విలాసవంతంగా నిర్మించిన తన నివాసంలో గడుపుతూ రాచరిక వ్యవస్థకు చిహ్నంగా మారటం జనం క్షమించలేక పోతున్నారు. అంతే కాదు ఎన్నికలయ్యాక మూడు నెలల కాలం పూర్తి మంత్రి వర్గం లేకుండానే ఒక మైనారిటీ హోంమంత్రితో కాలక్షేపం చేయటం ఐదు కోట్ల ప్రజలకు సుతరామూ నచ్చలేదు. 


టీ-పీసీసీ అధినేతగా చాలా కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న ఉత్తమ్ కుమార్ గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రబావం చూపలేక పోయారు. అంతేకాదు హుజూర్ నగర్ లో తాను గెలిచినా, పార్టీ తరఫున తగిన సంఖ్యలో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకో లేకపోవటం ఆయన విఫల నాయకుడే అని చెప్పాలి. ఈ క్రమంలో ఉత్తమ్ కుమార్ ను దించేసి ఆ అధికార పీఠాన్ని తమకు ఇవ్వాలని నల్లగొండ జిల్లాకే చెందిన అగ్రెసివ్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వద్ద మంచి పలుకు బడి ఉన్న వి.హన్మంతరావు, టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డిలు తమదైన శైలిలో ప్రయత్నాలు చేశారు. ఇప్పటిదాకా ఈ ప్రయత్నాలేవీ ఫలించకున్నా, నేతల మధ్య దూరాన్ని పెంచాయి.

అయితే ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నిక పుణ్యమా! అని ఇప్పుడు ఉత్తమ్ కుమార్ కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలు బాసటగా నిలిచారు. ఈ ముగ్గురూ కలిస్తే, ఇంకే ముంది, దాదాపుగా పార్టీలోని అన్ని వర్గాలు ఒక్కచోటికి చేరినట్టేనన్న కాంగ్రెస్ లో ఐఖ్యత మొదలైందని వాదన వినిపిస్తోంది. ఒక వైపు ఉత్తమ్ కుమార్, మరో వైపు కోమటిరెడ్డి, ఇంకోవైపు నుంచి రేవంత్ రెడ్డి, హుజూర్ నగర్ లో కాంగ్రెస్ ప్రచారాన్ని మూకుమ్మడిగా ముమ్మరంచేసి హోరెత్తిస్తున్నారు.


అసలే ఉత్తమ్ కు గట్టి పట్టున్న హుజూర్ నగర్ లో ఇతర పార్టీల అభ్యర్థులు గెలవడం కష్టమేనన్న వాదన వినిపిస్తున్నా, ఎన్నికల వ్యూహాల్లో దిట్టగా పేరొందిన కేసీఆర్, హుజూర్ నగర్ పై అవ్యాజమైన రాజకీయ మక్కువ పెంచుకొని వ్యూహాలపై వ్యూహాలు రచించారు. అయితే ఆ వ్యూహాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో కనిపిస్తున్న ఐక్యతా రాగం ముందు బలాదూర్ దిగదుడుపే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ ఇప్పుడు తన వ్యూహాలతో విరుచుకు పడటంలో కాంగ్రెస్లో అనుకోని ఐఖ్యతకు పునాదు పడ్డాయి.  అదే మున్ముందు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఊతం అవుతుందని చెప్పారు. ఈ దెబ్బకు కేసీఆర్ తనపై తానె వేసుకున్న స్వయంకృతాపరాధ అస్ట్రానికి బలికాక తప్పదన్న వాదన బలంగానే వినిపిస్తోంది. ఇదే జరిగితే, కాంగ్రెస్ పార్టీ చేతిలో కేసీఆర్ బ్రతుకు బజారే అనే కోణంలో ఆసక్తికర విశ్లేషణలు మొదలయ్యాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: