పెళ్లి... పిల్లలపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసిన మృణాల్ ఠాకూర్..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న యువ నాటిగ కెరియర్ ను ముందుకు సాగిస్తున్న వారిలో మృణల్ ఠాగూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీత రామం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని , అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో దక్కించుకుంది. దానితో ఈ మూవీ తర్వాత ఈమెకు నాచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన హాయ్ నాన్న అనే సినిమాలో అవకాశం దక్కింది. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించడంతో , ఈమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది.

ఇక తాజాగా ఈ బ్యూటీ నటించిన "ది ఫ్యామిలీ స్టార్" అనే సినిమా థియేటర్ లలో విడుదల అయింది. విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన ఈ సినిమాకు పరశురామ్ పేట్ల దర్శకత్వం వహించగా ... దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం మృణాల్ కి నిరాశననే మిగిల్చింది. ఇలా వరుసగా రెండు మూవీ లతో తెలుగు పరిశ్రమలో విజయాలను అందుకున్న ఈ బ్యూటీ కి తెలుగులో హైట్రీక్ దక్కలేదు. ఇకపోతే తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ లో భాగంగా పెళ్లి , పిల్లల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా మృణాల్ మాట్లాడుతూ ... త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పుకొచ్చింది. కానీ బిడ్డను కానీ ఆలోచన మాత్రం లేదు అని చెప్పింది. ప్రిజింగ్ ఏగ్స్ విధానానికి సుముఖంగా ఉన్నట్లు భవిష్యత్తులో దాని గురించి ఆలోచిస్తాను అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ఇకపోతే అమ్మతనాన్ని వాయిదా వేయాలనుకునే మహిళలు వయస్సులో ఉన్నప్పుడే తమ అందాలను భద్రపరచుకొని నచ్చినప్పుడు IVF పద్ధతిలో పిల్లలు కనడమే ప్రిజింగ్ ఏగ్స్ అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: