టిడిపి వైసిపి రెండూ రెండే - కన్నా లక్ష్మీ నారాయణ

Gowtham Rohith

రాష్ట్రం లో వర్షాల వల్ల వరద ఉదృతి పెరిగిపోయింది. చాలా గ్రామాలు వరద భీబత్సం వల్ల నాశనమయ్యాయి. కొన్ని లక్ష్గల ఎకరాల పంట నాశనమయ్యింది. ఇటు వంటి పరిస్తితుల లో ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటన పై చాలా మంది విమర్శలు కురిపిస్తున్నారు. 


రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కన్నా లక్ష్మీ నారాయణ ఈ విషయం‌ పై ఘాటుగా స్పందించారు. అటు జగన్ పై మాత్రమే కాకుండా మాజీ ముస్క్య మంత్రి చంద్రబాబు నాయుడు పై కూడా విమర్శ అస్త్రాన్ని సందించారు. గత ఐదేళ్ళు పాలించిన చంద్ర బాబు కూడా వరడ సమయం లో తన ఇళ్ళు నీట మునుగిన కారణంగా ఇక్కడ ఉండకుందా హైదరబాద్ కి వెల్లారంటూ ట్విట్టర్ వేదిక పై విమర్శలు చేశారు.


టిడిపి వైసిపి రెండూ రెండే నంటూ మరొసారి విమర్శించారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాష్ట్రాన్ని ఓ వైపు వరదలు ముంచెత్తుతుంటే సీఎం అమెరికా పర్యటన కు వెళ్లడం ఏంటి అన్నారు ఆయన. గత ఐదు సంవత్సరాలు పాలించి  రాష్ట్రం మొత్తం అప్పుల్లో ముంచిన చంద్రబాబు తన నివాసం మునగడం తో ఇప్పుడు చల్లగా హైదరాబాద్ జారుకుంటున్నారని ట్వీట్ చేశారు కన్నా. 



రాష్ట్రంలో వరదల సమయంలో
ప్రజల బాగోగులు అక్కరలేని సీఎం అమెరికా వెళ్లారు.
5 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినాయన 'కొంప మునిగి' హైదరాబాద్ జారుకున్నాడు..
వారిద్దరి 'తోక నేతలు'చేస్తున్న చర్చ"ఇల్లు మునిగిందా,లేదా"?
ఇల్లు సంగతి వదిలేయండి మీ రెండు పార్టీల వలన రాష్ట్రం నిండా మునుగుతోంది. pic.twitter.com/cx2Gufcsat

— Kanna Lakshmi Narayana (@klnbjp) August 17, 2019

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వాభూసన్ హరిచందన్ వరద ప్రభావిత తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై వైమానిక సర్వే నిర్వహించారు. ఆ వీడియో‌ ని ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.

రాష్ట్రం వరదలతో విలవిలాడుతోంది
సీఎం గారు అమెరికా జారుకున్నారు.
మాజీ సీఎం గారు కరకట్ట వదిలేసి హైదరాబాద్ జారుకున్నారు
ఒక సీఎం చేయాల్సిన పనిని గవర్నర్ గారు తన భుజాలపై వేసుకొని చేస్తున్నారు.https://t.co/xkAPdCph40 https://t.co/gq9wxSapiv

— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) August 17, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: