చెప్పేది కొండంత.. ఇచ్చేది గోరంత.. చంద్రబాబు హామీలు నమ్మితే మోసపోయినట్లేనా?

Reddy P Rajasekhar
చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల అనుభవం ఉంది. అయితే ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటి కూడా లేదంటే ఆయన పాలన ఎలా ఉందో సులువుగా అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు చెప్పేది కొండంత అయితే ఇచ్చేది మాత్రం గోరంత అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు హామీలు నమ్మితే మోసపోయినట్లేనని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది.
 
ఏపీ ప్రజలు చంద్రబాబు హామీలను అస్సలు నమ్మట్లేదు. మేనిఫెస్టోను అమలు చేయడం కష్టమని కొందరు బీజేపీ నేతలే చెబుతుండటం గమనార్హం. చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు. చంద్రబాబు సొంత పార్టీ నేతలకు సైతం ఈ విషయం స్పష్టంగా తెలుసు. కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు 4,000 రూపాయల పింఛన్ ఇస్తానని 50 ఏళ్లు వయస్సు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు కూడా పింఛన్ ఇస్తానని తెలిపారు.
 
చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం కేవలం జులై నెల పింఛన్ల కోసమే 5000 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్క పింఛన్ కోసమే సుమారు రూ. 5000 కోట్లు ఖర్చు చేస్తే ఇతర పథకాలను ఎలా అమలు చేస్తారనే ప్రశ్నలకు సమాధానం లేదు. జగన్ అమ్మఒడి స్కీమ్ ను కాపీ కొట్టి చంద్రబాబు తల్లికి వందనం పేరుతో ఒక స్కీమ్ ను ప్రకటించారు. ఈ స్కీమ్ అమలు చేయాలంటే ఐదేళ్లలో 50 వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
 
మరి వాస్తవంగా అంత మొత్తం ఖర్చు చేసే పరిస్థితులు లేవు. చంద్రబాబు ప్రకటించిన హామీల అమలుకు 1,20,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2014లో రుణమాఫీ హామీనే సక్రమంగా అమలు చేయని బాబు ఇన్ని హామీలను అమలు చేసే అవకాశమే లేదు. బాబును నమ్మితే మోసపోయినట్లేనని ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని ఈ హామీలను అమలు చేసే ఛాన్స్ లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: