భారత సైన్యానికి కొత్త ఆయుధాలు..

Gowtham Rohith
ఆయుధాలు సమకూర్చుకోవడం అనేటువంటిది ఈవేళ అత్యంత అవసరం.అది శరవేగంగా భారత సైన్యానికి ఏర్పాటు చేస్తున్నారు. అందులోనే ఏకే 203 తుపాకులు ఇక్కడే తయారుచేయించి అందజేసేటువంటి ప్రక్రియ. అట్లాగే సైనికులకు వివిధ రకాలైనటువంటి కొత్త ఆయుధాలను అందిచ్చేటువంటి ప్రక్రియ జరుగుతోంది. సుదీర్ఘ కాలం పాటు గ్యాప్ వచ్చిన దానివల్ల జరుగుతున్నటువంటి పరిణామాల్ని పరిష్కరించేటువంటి క్రమం జరుగుతుంది. ప్రధానంగా ఎయిర్ ఫోర్స్ మీద దృష్టిపెట్టారు, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు దగ్గర్నించి మళ్లీ అమెరికా దగ్గర్నించి 17 విమానాలు తీసుకోవడం దగ్గర్నుంచీ ప్రధానమైనటువంటి సమీక్ష మొన్ననే చూశాం.


పాకిస్థాన్ బోర్డర్ దాటి వచ్చినటువంటి సందర్భంలో మిగ్గులు సుకోలాంటి అవిగూడా యుధ్ధవిమానాలే కానీ, ఇవాల్టి జనరేషన్ కి తగినటువంటివి కాదు. అభినందన పుణ్యమా అని చెప్పి ఏదో చేయగలిగితే చివరకి ఆ రకమైనటువంటి యుధ్ధవిమానాల వల్లనే అక్కడ చిక్కుకున్నటువంటి సందర్భం. విదేశాంగ ఎత్తుగడ రాజకీయ ఎత్తుగడ తీవ్ర హెచ్చరికల ద్వారా మనమేదో సాధించుకోగలిగాం కానీ అది ఎల్లవేళలా సాధ్యం కాదు. ఇట్లాంటి దశలో అర్జెంటుగా మన సైన్యాన్ని బలోపేతం చేసుకునేటువంటి ప్రక్రియ అందులో ఎస్పెషల్లీ వాయుసేనని బలోపేతం చేయడానికి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి.


తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 15,00 కోట్ల రూపాయల డీల్ ను రష్యాతో కుదుర్చుకుంది. ఇది ఆర్ 27 ఎఐఆర్ ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ ఆర్ 27 ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ ను త్వరగా భారతదేశం లోనే తయారు చేసేటటువంటి రకం. ఇక్కడే కొన్ని తయారు చేసి , కొన్ని రష్యాలో తయారు చేసి ఇక్కడికి తెచ్చుకునేటువంటిది. ఇది గాలిలో నుంచి గాల్లో ఉండేటువంటి విమానాల్ని పేల్చేది. ఏదైతే మొన్న ఎఫ్ 16 యుద్ధ విమానం ద్వారా గాలిలో నిండిన మన మిగ్ ని కూల్చారు వాళ్లు


ఇక్కడ అభినందన కూడా మన మిగ్ విమానం ద్వారా వాళ్ల విమానాన్ని గాల్లోనే కూల్చారు.అయితే ఎవరు వేగంగా చేస్తారు. అక్కడున్నటువంటి టెక్నాలజీ ఎంత వేగంగా ఉంటది. ఆ మిస్సైల్ కెపాసిటీ అనేటువంటిది ముఖ్యం ఆ మిస్సైల్ కెపాసిటీ అనేటువంటిది వాళ్లది స్ట్రాంగ్ గా ఉండటం వల్ల మనం దెబ్బతినడం అదే సమయంలో మనవాడి తెలివితేటల వల్ల పాకిస్తాన్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది.ఇక్కడ ఇప్పుడు ఇలాంటి అత్యాధునికమైనటువంటి ఆర్ 27 మిస్సైల్ ఇది టార్గెట్ ని కచ్చితంగా నిర్దేశించి కొడితే డైరెక్ట్ గా పేల్చేటువంటి సందర్భం ఉంటది.


విటిని సుకోయిలకి ఏర్పాటు చేయడంతో పాటుగా టోటల్ గా యుద్ధ విమానాలు అన్నిటికీ విటినీ ఫిక్స్ చెయ్యటానికి సంబంధించినటువంటి మిస్సైల్స్ కి 1,500 కోట్ల రూపాయల డీల్ జరిగింది. అతి త్వరలో వీటికి సంబంధించిన సప్లై బిగిన్ చేయాలనడం,కాకపోతే కొంత సమయం తీసుకుంటుంది ఒక 6 నెల్ల నుంచి ఏడాది దాకా కూడా ప్రారంభం అనేటువంటిది ఇది తాజాగా భారత్ అమ్ములపొదిలో చేరుతున్నటువంటి మరొక రకమైనటువంటి తాజా ప్రక్రియ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: