ఆగష్టు 15న వైఎస్ జగన్ మరో సంచలనం నిర్ణయం..

guyyala Navya
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగష్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్బంగా మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారట. అధికారంలోకి వచ్చి 50 రోజులే అయి ఉండవచ్చు కానీ అయన సంచలన నిర్ణయాలు లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. రోజుకో సంచలన నిర్ణయం గతంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని పనులు వైఎస్ జగన్ చేస్తున్నారు. 


వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేసే పథకాలు పుట్టిన పాపా నుంచి వృద్దుడి వరుకు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపయోగ పడే పథకాలను తీసుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు ఎం ఉంటాయి. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే మొదట చేసిన పని ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను బదిలీ చెయ్యడం.


ఏ నాయకుడు అధికారంలోకి వచ్చిన మొదట ఎమ్మెల్యేలు, మళ్ళి మంత్రులు అందరూ వచ్చాకా ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల గురించి ఆలోచించే వారు. అలాంటిది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదట ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను బదిలీ తర్వాత మిగితావారు అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగష్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఉద్యోగుల విషయంపై మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నారని పార్టీ నేతలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ గుసగుసలు ఎంతవరుకు నిజమో తెలియాలి అంటే ఆగష్టు 15 వరుకు ఆగాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: