ఆలయాల్లో ఇక నిత్య పూజలే

SEEKOTI TRIMURTHULU
 -రాష్ట్ర బడ్జెట్  లో ఆలయాలకు నిధులు కేటాయింపు 

-జిల్లాలో 6 కేటగిరిలో ఉన్న 776 గుడులు

-తండ్రి బాటలో నడిచిన  సీఎం జగకు సర్వత్రా అభినందనలు 

 రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి ఆలయాల అభివృద్ధి , నిత్యా కైంకర్యాలు కోసం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బడ్జెట్ లో భారిగా నిధులు కేటాయించింది. హిందూ సాంప్రదాయ ఆస్తులైన దేవాలయాలకు పూర్వ వైభవం కలిగించేందుకు ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుం బిగించారు. గడిచిన పదేళ్లలో ప్రభుత్వ ఆర్ధిక చేయూతకు దూరమైనా  కేవలం దాతల సహకారంతో నడుస్తున్న ఆలయాలకు దీంతో కొంత్త వెసులుబాటు లభించింది. వైఎస్ ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేకంగా రూ.234 కోట్లు కేటాయించింది.

దీంతో జిల్లాలో ఆలయాలకు సుమారు రూ.18 కోట్లు నుంచి రూ.20 కోట్ల వరకు కేటాయింపులు జరగవచ్చని అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఈ నిధులతో జిల్లాలో ఆదాయపరంగా వనరులులేని ఆలయాల్లో నిత్య కైంకర్యాలు , ధూపదీల నైవేద్యాలలో ఏ లోటు లేకుండా నిర్వహించేందుకు వీలు కలుగుతుంది.

జిల్లాలో దేవాదాయ శాఖలో ఆదాయ వనరుల్లేని ఆలయాలకు మహర్దశ పట్టనుంది. జిల్లాలో మొత్తం 825 వరకు చిన్న , పెద్ద దేవాలయాలున్నాయి. ఇందులో 6 ఎ ఆలయాలుగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి, పాలకొండ శ్రీ కోటదుర్గమ్మ, శ్రీ కూర్మం కూర్మనాధస్వామి, కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి, రావివలస ఎండల మల్లికార్జున స్వామి వారి ఆలయాలున్నాయి. 6 బి ఆలయాలుగా మొత్తెము 31, 6సి ఆలయాలు (రూ.రెండు లక్షల కన్నా తక్కువ ఆదాయం వచ్చే దేవాలయాలు ) మొత్తం 886 కాగా 18 మఠాలు 6 డి ఆలయాలున్నాయి.

ప్రభుత్వ బడ్జెట్ లో ఆలయాల నిత్య కైంకర్యాలకు రూ.234 కోట్లు కేటాయించారు. అయితే గ్రామాల్లో జనాభా ప్రాతిపదికన నిదులను మంజూరు  చేసేలా ప్రతిపాదించారు.  గ్రామీణ ప్రాంతాల్లో 2 వేల జనాభా ఉన్న ప్రాంతంలోని దేవాలయానికి ఏటా రూ.30 వేలు , 5 వేలు జనాభా ఉన్న ప్రాంతాల్లోని ఆలయాలకు రూ.60 వేలు , 10 వేలు జనాభా ఉన్న గ్రామాల్లో ఆలయాలకు రూ.1.20 లక్ష లు ఏటా కేటాయించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: