చకచకా పనులు చేసుకుపోతూ పాలనలో వెగం పెంచనున్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి

ఏపి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్‌మోహనరెడ్డి తొలిసారిగా ఏపి సచివాలయంలో అడుగుపెట్టారు. తాడేపల్లి లోని తన నివాసం నుంచి నేరుగా సచివాలయాని కి చేరుకున్న సీఎం - ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా సచివాలయం ఉద్యోగులు జగన్‌కు ఘన స్వాగతం పలికారు. 

మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న ధర్మాన కృష్ణదాస్‌, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు వైసిపి నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ ముందు తన తండ్రి చిత్ర పటానికి నమస్కరించారు. వెంటనే  మూడు కీలక దస్త్రాలపై సంతకం చేశారు. 

*ఆశా వర్కర్ల జీతాలను ₹ 10000/- పెంచిన దస్త్రంపై తొలి సంతకం చేయగా, 
*అనంత ఎక్స్‌ప్రెస్-హైవేకి కేంద్ర అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. 
*జర్నలిస్టుల హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేస్తూ జగన్ మూడో సంతకం చేశారు. 

ఉదయం 11:42 గంటలకు మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి మరో ఐదుగురికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఏపీ ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్‌లుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, పార్థసారథి, కొరుముట్ల శ్రీనివాస్‌లను నియమించారు. కాగా వీరిలో దాదాపు అందరూ మంత్రి పదవి ఆశించినవారే. సామాజిక వర్గం పరంగా లెక్కలేసిన సీఎం ఈ ఐదుగురికి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. దీంతో విప్‌లుగా ఈ ఐదుగురు కీలకనేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉంటే ఈ ఐదుగురు కూడా గవర్నర్ నరసింహన్ సమక్షం లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు._

ఏపి అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం, డిప్యూటి స్పీకర్‌గా పీడిక రాజన్న దొరను నియమించనున్నట్లు సమాచారం. ఇవాళ మధ్యాహ్నం వీరిద్దరూ సియం జగన్‌తో సమావేశమయ్యారు. తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో ఆయనకు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ నెల 12 నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

ఏపి ప్రభుత్వ సలహాదారుగా జివిడి కృష్ణమోహన్‌ నియమితులయ్యారు. కమ్యూనికేషన్స్‌ సలహాదారుగా వ్యవహరించనున్నారు ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను సిఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం జారీ చేశారు. అలాగే సియం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పివి రమేశ్‌ను, సియం అదనపు కార్యదర్శిగా జె.మురళిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: