విదేశాంగ మంత్రిగా ‘మోడీ-మాన్ సుబ్రమణ్యం జైశంకర్’

సుబ్రమణ్యం జై శంకర్ - విదేశాంగ శాఖామాత్యులు - మోడీ-మాన్ అని చెప్పవచ్చు. అయితే బహుభాషలు మాట్లాడగల ప్రఙ్జావంతుడు. తండ్రి ఎస్ సుబ్రమణ్యం కూడా ఒక ప్రముఖ భారత వ్యూహాల విశ్లేషకుడు, వ్యాఖ్యాత సివిల్ సర్వెంట్ కూడా! అవే గుణాలు పుణికి పుచ్చుకున్న జై శంకర్ చైనా, అమెరికా వ్యవహారాల్లో అపార అనుభవం ఆయన సొంతం చేసుకున్నారు. భారత్‌ ను ప్రపంచశక్తిగా నిలపాలని భావిస్తోన్న నరేంద్ర మోదీ, అందుకు అనుగుణంగా దౌత్యం నిర్వహణలో  నిష్ణాతుడైన జైశంకర్‌కు తాజాగా విదేశాంగ శాఖను కట్టబెట్టారని భావిస్తున్నారు.


అమెరికా, చైనాలతో స్నేహంతో పాటు పాకిస్థాన్‌ తోనూ "విదేశాంగ విధానం ఉండవలసిన పద్దతి’ దానితో వ్యహరించాల్సిన ప్రత్యేక విధానం నిర్ణయించుకోవాల్సిన ఉన్న తరుణంలో సమర్థుడైన విదేశాంగ అధికారిగా, రాయబారిగా, దౌత్యం చేయటంలో నేర్పరిగా, బహుముఖ ప్రఙ్జావంతుడుగా, పేరుప్రతిష్టలు పుష్కళంగా ఉన్న జైశంకర్‌కు విదేశాంగ బాధ్యతలు అప్పగించారు.


విదేశాంగ కార్యదర్శిగా పనిచేసి ప్రధాని నత్రంద్ర మోదీ కేబినెట్‌ లో ప్రస్తుతం విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సుబ్రమణం జై శంకర్ మోడీ చేత ప్రత్యేకంగా ఎంపికచేయబడి మోడీ మాన్ గా అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఒక దౌత్యవేత్తగా వృత్తి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయనను విదేశాంగ మంత్రిగా ఎంపిక చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి.


బ్రిక్స్, జీ-20, షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీ ఓ) తదితర అంతర్జాతీయ కూటములలో భారత్ ను ప్రభావవంతంగా వ్యవహరించే దిశగా నూతన విదేశాంగ మంత్రి పనిచేసే అవకాశాలు ఉన్నాయి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్‌ లతో వాణిజ్య, రక్షణ సంభందాలను బలోపేతం చేసే దిశగా ఆయన దృష్టి కేంద్రీకరించ నున్నారు. అదే సమయంలో పొరుగు దేశాలతోనూ స్నేహాన్ని పెంపొందించుకోనున్నారు. ఈ కార్యక్రమాల్లో మానవ సంభంధాల నిర్వహణ కంటే – ముఖ్యంగా వ్యూహాత్మక భాగస్వామ్యాల నియంత్రణ ముఖ్యం. 


*ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి” లో శాశ్వత సభ్య దేశంగా భారత్ చోటు పొందడం

*న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్‌’ లో చేరిక లాంటి అంశాలపై ఆయన దృష్టిపెట్టటం ఇప్పటి ప్రధాన బాధ్యత. 


నాలుగు దశాబ్దాలపాటు విదేశాంగ శాఖలో పని చేసిన ఆయన, 2015 జనవరి నుంచి 2018 జనవరి వరకు విదేశాంగ కార్యదర్శిగా పని చేశారు. ఆయన ఈ సుధీర్ఘ సేవలకు గుర్తింపుగా గత మార్చిలో రాష్ట్రపతి చేతుల మీదు గా “పద్మ శ్రీ” పురస్కారం అందుకున్న జైశంకర్ రెండు నెలల్లో అదే రాష్ట్రపతి భవన్ లో  మంత్రిగా ప్రమాణం చేశారు.


చాలాకాలం పాటు చైనాలో భారత రాయబారిగా పనిచేసిన జై శంకర్, డోక్లాం ఉద్రిక్తతల సమయంలో డ్రాగన్‌ చైనాతో జరిపిన పలుచర్చల్లో కీలకపాత్ర పోషించారు. ఆయన చైనాలో రాయబారి గా ఉన్న సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో మోదీ బీజింగ్‌ లో పర్యటించారు. అప్పటి నుంచి ఆయన నరేంద్రమోదీకి దగ్గరయ్యారు. జై శంకర్ చైనా రాయబారి గా ఉన్న సమయంలోనే, చైనా భారత్‌ లో, ముఖ్యంగా గుజరాత్‌ లో అధికంగా పెట్టుబడులు పెట్టింది. బహుశ ఇదే జై శంకర్ నరెంద్ర మోడీకి దగ్గరవటాని కారణం అయి ఉంటుంది.


తొలినాళ్ల లో రష్యాలో పని చేసిన జై శంకర్‌ రష్యన్‌ భాషలో అనర్గళంగా మాట్లాడగలరు. ఆయనకు జపనీస్, హంగేరియన్ భాషల్లోనూ ప్రవేశం ఉంది. సింగపూర్‌, చెక్ రిపబ్లిక్‌ ల్లో ఆయన పని చేశారు. “భారత్ ముందుగా అణ్వాయుధాలను వాడదు” అనే పాలసీకి ఆయన తండ్రి సుబ్రమణ్యం రూపకల్పన చేశారు. దాన్నే జై శంకర్ కొనసాగించి ప్రపంచ వ్యాపతంగా దౌత్యవేత్తల అభిమానం సంపాధించుకున్నారు.


అమెరికా రాయబారిగా పని చేసిన జైశంకర్, భారత్, అమెరికా అణు ఒప్పందం రూప కల్పన లో కీలక పాత్ర పోషించారు. 2007 లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హయాంలో ఈ ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. 1977 బ్యాచ్‌ కి చెందిన జైశంకర్‌ 2013లోనే విదేశాంగ కార్యదర్శి పదవిని పొందాల్సింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా సుబ్రమణ్యం జై శంకర్ వైపే మొగ్గు చూపారు. కానీ కాంగ్రెస్ నేతల సూచనలతో సీనియార్టీ ప్రకారం సుజాత్ సింగ్‌కు ఆ పదవి దక్కింది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక సుజాత సింగ్‌ను తప్పించి జైశంకర్‌కు బాధ్యతలు అప్పగించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: