కర్ణాటకలో దెవెగౌడ ఖేల్ ఖతం: రాజకీయాల నుండి గెంటేశారా!

86 యేళ్ళ వయసున్న మాజీ ప్రధాని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవేగౌడ నేడు తమకూరు నియోజక వర్గంలో తన కుటుంబ ఆధిపత్య పార్టీ జెడీఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ స్థానంలో బిజెపి అభ్యర్థి బసవరాజ్‌ గెలుపొందారు. అయితే దేవగౌడ్‌ 1953 లో కాంగ్రెస్‌ పార్టీలో చేరి తన రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన ఆయన అప్పటి నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 

కర్ణాటక సీఎంగా, భారత ప్రధానిగా కూడా విధులు నిర్వర్తించారు. మొదట కర్ణాటక లోని హోళెనరసిపుర శాసనసభ నియోజకవర్గం నుంచి 1962 లో తొలిసారిగా దేవెగౌడ ఎమ్మెల్యేగా ఎన్నికై అనంతరం కూడా మరో ఐదుసార్లు అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1991 నుంచి ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 లోనూ హసన్ నుంచి పోటీ చేసి గెలుపోందారు.

అయితే ఆయ్న తన వారసులుగా తన కుమారులు హెచ్ డి రెవణ్ణ గౌడ, హెచ్ డి కుమారస్వామి గౌడ, వారి కుమారులు ప్రజ్వల్ రేవణ్ణ గౌడ, నిఖిల్ కుమార గౌడ వరకు మూడు తరాలుగా వారసులను రాజకీయాల్లోకి తెచ్చారు. నిఖిల్ కుమారస్వామి గౌడ మంద్య నియోజకవర్గంలో తెలుగువారి ఆడపడుచు సుమలత అంబరీష్ చేతిలో ఓడిపోయారు. 

ఆయన మనవడు నిఖిల్ కుమారస్వామి గౌడతో కలసి ఆయన ఓడిపోవటం సిగ్గుచేటైన విషయమని అంటున్నారు విశ్లేషకులు. కర్ణాటక ప్రజలు ఇప్పుడు దేవే గౌడను రాజకీయాల నుండి తన్ని తగలేసినట్లైందని చెపుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: