పవన్ కళ్యాన్ పాయే..!

Edari Rama Krishna
పవన్ కళ్యాన్ విపరీతమయిన అభిమానులు, మంచి మనిషనే గుర్తింపు వాక్పటిమ,అన్నింటికి మించి ఆరేళ్ల రాజకీయానుభవము, యువత హృదయాలను తట్టి లేపగల భావావేశం.


అయితే ఇవేవీ పవన్ కళ్యాన్ గారి మీద ప్రజాక్షేత్రంలో సానుకూల ధృక్పధాన్ని తీసుకురాలేనట్లే ఉంది.  భీమవర శాసన సభకు పవన్ కళ్యాన్ పోటీ చేసిన విషయం విదితమే.


పవన్ కళ్యాన్ జన్మ స్థలమున్న నియోజక వర్గం, పవన్ కళ్యాన్ సామాజిక వర్గమెక్కువగా ఉన్న నియోజకవర్గం భీమవరం అయినా ఇటువంటి నియోజక వర్గంలో కూడా పవన్ కళ్యాన్ ఎదురీదుతున్నారు.


సామాన్యుడయిన వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ రావు చేతిలో ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు.  ప్రస్తుతానికి ప్రత్యర్థి దాదాపు వెయ్యి ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు.


జనసేన అధినేత పవన్ కళ్యాన్ పరిస్థితి ఇలా ఉంటే జనసేనులను పరిస్థితి ఇంతకంటే గోరం ఏ ఒక్కరూ కూడా ఆదిక్యతలో లేరు.  చూడాలి కథ ఇప్పుడే మొదలయ్యింది..ఎప్పటికప్పుడు తాజాగా విశేషాలను మీకు తీసుకొస్తాము ఇండియాహెరాల్డ్ గ్రూప్. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: