ఫెడరల్ ఫ్రంట్ ఒక కల - మహాకూటమి మాత్రమే వాస్తవం


కలవకుంట్ల చంద్రశేఖరరావు ను జాతి ఒక అపనమ్మకమైన వ్యక్తిగా ఇప్పటికే గుర్తించింది. ఆయన విశ్వాసహీనతకి మారుపేరని కాంగ్రెస్ పార్టీ ఏనాడో గుర్తించింది. ఆయన స్వార్ధపరత్వం మూర్తీభవించిన వ్యక్తిగా తెలంగాణా ప్రజలు అభివర్ణిస్తున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలపలితాలు కేసీఆర్ కు ధారుణమైన చెంపపెట్టుగా మారవచ్చు. 
అయితే ఆయన అద్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ ఎట్టి పరిస్థితుల్లో నెరవేరని ఒక కలగా మాత్రమే మిగిలిపోతుందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు.


దీనికి కారణం, కేసీఆర్ ఒక అవకాశవాది అని,  ఆయన విభిన్న రాజకీయ పక్షాలు, తెలంగాణా ప్రజల విశ్వాసం కోల్పోయిన వ్యక్తి అని ఆయనను ఎవరూ నమ్మరని అన్నారు. అందుకే అతని జట్టులో ఎవరూ చేరనపుడు ఆ ఫెడరల్ ఫ్రంట్ నిలబడే ప్రసక్తే లేదన్నారు. దేశంలో మూడో ఫ్రంట్ ఇప్పటికే చాలాసార్లు ఫెయిలయ్యింది, ఇంకోసారి అసలు ఏర్పడదన్నారు. కేవలం కేసీఆర్ ఆయా పార్టీనేతలను కలిసినంత మాత్రాన వారంతా కేసీఆర్ తో ఉన్నారని భావిస్తే అదివాస్తవం అనిఎలా అవుతుంది  అని ప్రశ్నించారు. దేశంలో రెండే కూటములు ఉన్నాయి. ఒకటి బీజేపీ కూటమి, మరోటి కాంగ్రెస్ కూటమి. అన్ని పార్టీలు వీటి లో ఏదో ఒకటి లేకుండా మనలేవు కాబట్టి ఏదో ఒక దానిలో చేరబోతున్నాయని అన్నారు.

మరో సంధర్భంలో, తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం అభిప్రాయం కూడా ఇదే. ఫెడరల్ ఫ్రంట్ ఒక అత్యాశ అని, ఈ కేసీఆర్ రాజకీయ పర్యటనలు అన్ని ఒక నాటకం మాత్రమే నని అన్నారు. దేశంలో 22 పార్టీలు కలిసి "మహాకూటమి" గా ఏర్పడ్డాయి. ఎన్నికల అనంతరం ఆ మహాకూటమి మాత్రమే అధికారంలోకి రానుందని అని కోదండరాం వ్యాఖ్యానించారు. 


ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కాదని చెప్పను, కానీ ఏర్పడినా దాని ప్రభావం ఉపయోగం ఉండదు. ఎందుకంటే అందులో చేరడా నికి ఎవరూ సిద్ధంగా లేరు. అందులో కూడా కలవకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబ పార్టీ టీఆర్ఎస్, వైఎస్ జగన్మోహనరెడ్డి పార్టీ వైసీపీ మాత్రమే ఉంటాయి. అంటే ఇది మహా అయితే ఒక తెలుగు ఫ్రంట్ గా మాత్రమే మిగిలిపోతుందని కోదండరాం అభిప్రాయపడ్డారు. ఈ ఫ్రంట్ పేరుతో కాలయాపన తప్ప ఉపయోగం లేదని తన అభిప్రాయం వెలిబుచ్చారు. అందుకే ఈ సోది వదిలేసి కొంతైనా తెలంగాణ ప్రజల సమస్యలపై దృష్టిపెట్టాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కోదండరాం హితవు పలికారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: