నంద్యాల పార్లమెంట్ లో కూటమికి కష్టమే.. ఆ నియోజకవర్గంపై మాత్రమే ఆశలున్నాయా?

Reddy P Rajasekhar
2024 ఎన్నికల్లో కూటమి నేతలు నంద్యాల జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సత్తా చాటుతామని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. నంద్యాల పార్లమెంట్ పదిధిలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉండగా ఈ 7 నియోజకవర్గాల్లో కనీసం 3 నియోజకవర్గాల్లో అయినా సత్తా చాటుతామని కూటమి నేతలు భావిస్తుండటం గమనార్హం. అయితే వైసీపీ మాత్రం నంద్యాల జిల్లాలో సైతం క్లీన్ స్వీప్ చేస్తామని కాన్ఫిడెన్స్ తో ఉంది.
 
నంద్యాల పరిధిలోని నందికొట్కూరు నియోజకవర్గంలో టీడీపీ కూటమి నుంచి గిత్తా జయసూర్య వైసీపీ నుంచి దారా సుధీర్ పోటీ చేస్తుండగా దారా సుధీర్ కే అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కూటమి నుంచి భూమా అఖిలప్రియ, వైసీపీ నుంచి గంగుల బ్రిజేంద్ర రెడ్డి అభ్యర్థులుగా ఉండగా వైసీపీ మరోసారి సత్తా చాటే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది.
 
శ్రీశైలం నియోజకవర్గంలో వైసీపీ నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి కూటమి అభ్యర్థిగా బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పోటీ చేస్తుండగా శిల్పానే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీ నుంచి కాటసాని రామిరెడ్డి, కూటమి అభ్యర్థిగా బీసీ జనార్దనరెడ్డి పోటీ చేస్తుండగా ప్రజలు బీసీ జనార్ధనరెడ్డి వైపు ఉన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో మాత్రం కూటమి సత్తా చాటే ఛాన్స్ అయితే ఉంది.
 
పాణ్యం నియోజకవర్గంలో కూటమి తరపున గౌరు చరితా రెడ్డి, వైసీపీ తరపున కాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు.  ఇక్కడ కాటసాని సత్తా చాటనున్నారని తెలుస్తోంది.
నంద్యాల జిల్లాలో టీడీపీ కూటమి తరపున ఎన్‌ఎండీ ఫరూక్‌ పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి శిల్పా రవిచంద్రా కిషోర్‌ రెడ్డికి టికెట్ దక్కింది. ఇక్కడ కూడా వైసీపీ సత్తా చాటే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. డోన్ నుంచి టీడీపీ కూటమి తరపున కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్నా వైసీపీకే ఎడ్జ్ ఉంది.
 
నంద్యాల వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తుండగా నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి పోటీ చేస్తున్నారు. ఇక్కడ పోచా బ్రహ్మానందరెడ్డికే అనుకూల ఫలితాలు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: