ఓటీటీలోకి రాబోతున్న సూపర్ హిట్ మూవీ..!!

murali krishna
సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం "ది గోట్ లైఫ్" (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించగా..అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ రచయిత బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమా రాగా.. సర్వైవల్ అడ్వెంచర్‌గా వచ్చిన ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతుంది.ఈ ఏడాది తెలుగు సినిమాల కన్నా మలయాళ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. అందులో పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించిన సూపర్ హిట్ మూవీ ‘ది గోట్ లైఫ్’ ఒకటి.మలయాళ ఇండస్ట్రీ నుంచి విడుదలైన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఒకదాన్ని మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి.. తాజాగా ‘గోట్ లైఫ్’ సినిమా కూడా అదే లిస్ట్ లోకి చేరింది.. భారీ కలెక్షన్స్ రాబట్టి అదే లిస్ట్ లోకి చేరింది…ఈ సినిమా మార్చి 28న పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఈ చిత్రం పది రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర రూ.150 కోట్లకుపైగా వసూలు చేసింది. దీంతో ఇప్పుడీ మూవీ రానున్న శుక్రవారం నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రిలీజ్ కాబోతుందని సమాచారం. ఓటీటీలో కూడా మంచి కలెక్షన్స్ ను అందుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు.. 26 నుంచి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుందని కూడా సమాచారం. ఈ రెండు తేదీలపై ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టతా రాలేదు.. త్వరలోనే అఫిషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తుంది…ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. కేరళకు నుంచి దుబాయ్ కి సంపాదించుకోవడం కోసం వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ బానిసత్వం ఎదుర్కొంటాడు.. అక్కడ నుంచి ఎడారి మార్గం ద్వారా ఇండియా బయలు దేరతాడు.. ఇంతకీ అతను ఇండియా కు చేరుకున్నాడా? మార్గమధ్యలో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా కథ.. ఆ దేశాలకు వెళ్లిన ఇండియన్స్ ఎలాంటి జీవితాన్ని గడుపుతారన్నది సినిమాలో చక్కగా చూపించారు.. ఈ మూవీ కోసం హీరో, డైరెక్టర్ దాదాపు పదహారేళ్లు కష్టపడ్డారు.. హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌ అయితే సినిమా కోసం చాలా కష్టపడి సన్నబడ్డాడు. నిజంగా అతని కష్టం ఊరికే పోలేదు.. సినిమా సూపర్ హిట్ అయ్యింది.. ఓటీటీలో ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: