ఏపీ రిజల్ట్ ఫై.. రఘువీర జోస్యం.. ఎవరు గెలుస్తారంటే?

praveen
ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ మే 13వ తేదీన ముగిసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఎన్నికల నగార మోగడంతో ఏపీ రాజకీయాలు ఎంతలా వేడెక్కాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గెలుపే లక్ష్యంగా పోలింగ్ ముందు వరకు కూడా అందరూ అభ్యర్థులు ప్రచార హోరుతో దూసుకుపోయారు. ఇక ప్రజలు ఇలా అభ్యర్థుల భవితవ్యం ఏంటి అన్నది మే 13వ తేదీనే తేల్చేశారు. అయితే ప్రజలు ఏం తీర్పును ఇచ్చారు అన్నది జూన్ 4వ తేదీన విడుదల కాబోయే ఫలితాల ద్వారా అందరికీ అర్థం కాబోతుంది.

 ఈ క్రమంలోనే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయంపై విపరీతంగా చర్చ జరుగుతుంది. ఇక బెట్టింగ్ రాయుళ్లు అయితే విచ్చలవిడిగా ఆ పార్టీ గెలుస్తుంది ఈ పార్టీ గెలుస్తుంది అంటూ తెగ బెట్టింగులు వేసుకుంటున్నారు. ఇంకోవైపు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇదే విషయం గురించి చర్చ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే ఎంతో మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఏపీలో అధికారాన్ని చేపట్టబోయే పార్టీ ఏది అనే విషయంపై తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు అని చెప్పాలి. కాగా ఇటీవల ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి స్పందిస్తూ జోష్యం చెప్పారు.

 ఏపీలో వైసీపీ కూటమి మధ్య హోరాహోరీ పోరు ఉంది అంటూ చెప్పుకొచ్చారు రఘువీరారెడ్డి. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా భారీ మెజారిటీ కాకుండా 95 నుంచి 97 సీట్లతో మాత్రమే అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం కొనసాగింది అంటూ చెప్పుకొచ్చారు. వైసిపి, టిడిపి రెండు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టేందుకు వెనకడుగు వేయలేదు అంటూ రఘువీరారెడ్డి అన్నారు. సుమారు 100 స్థానాల్లో గెలిచిన వారికి  10000 లోపు మెజారిటీలే వస్తాయని చెప్పుకొచ్చారు. డబ్బు ప్రభావం లేని ఒకటి రెండు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పుకొచ్చారు. అయితే అటు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ విపరీతంగా జరిగిందని తెలిపారు రఘువీరారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: