బయపడిన కేసీఆర్ కుట్ర.. ఆయనను కూడా వదల్లేదట?

praveen
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ టాపింగ్ వ్యవహారంలో రోజురోజుకీ ఎన్నో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గులాబీ అధినేత కెసిఆర్ చేపట్టిన అక్రమ నిఘా వ్యవహారం అటు అంతకంతకు ఉచ్చు బిగుస్తూ ఉంది అని చెప్పాలి.  ఇప్పటికే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీకి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతూ ఉండగా.. ఇక ఎప్పుడు  ఆ పార్టీని ఎంతగానో ఇబ్బంది పెడుతున్న ఫోన్ టాపింగ్ వ్యవహారాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ డిసిపి రాధా కిషన్రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగు చూసాయి.

 మొన్నటి వరకు కేవలం ప్రతిపక్ష పార్టీల మొబైల్ ఫోన్ డాటా పై మాత్రమే అటు అక్రమ నిఘా పెట్టినట్లు అందరూ అనుకున్నారు  కానీ సొంత పార్టీలోనే నేతలను కూడా వదలకుండా ఫోన్ టాపింగ్ చేశారు అన్న విషయం ఇటీవల రాధా కిషన్ రావు వాంగ్మూలంలో బయటపడింది  అదే సమయంలో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణను కూడా అటు కెసిఆర్ వదల్లేదట. ఆయన ఫోన్ కూడా టాపింగ్ జరిగినట్లు ఇటీవల తేలింది. అయితే గతంలో రాధాకృష్ణ ఫోన్ టాప్ అయినట్లు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఫోన్ టాపింగ్ చేయించింది కేసీఆర్ అన్న విషయాన్ని ఇటివలే నిజాలు అన్నీ కక్కేశారు మాజీ డిసిపి రాధా కిషన్ రావు.

 అయితే కేవలం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ ఫోన్ మాత్రమే కాదు మరో మీడియా ఛానల్  యజమాని ఫోన్ ని కూడా టాపింగ్ జరిగింది అంటూ రాధా కిషన్ రావు చెప్పుకొచ్చారు. అదే సమయంలో బిజెపి నేతలు ఈటల రాజేందర్, బండి సంజయ్,  ధర్మపురి అరవింద్ సహా వారి సిబ్బంది ఫోన్లను కూడా టాపింగ్ చేసినట్లు వాంగ్మూలంలో ఒప్పుకున్నారు.  వీళ్లు మాత్రమే కాకుండా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన పలువురు వ్యాపారుల ఫోన్లు కూడా టాపింగ్ చేసినట్లు వాంగ్మూలంలో పూసగుచ్చినట్లుగా చెప్పారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: