ఫోన్ ట్యాపింగ్.. కేసీఆర్ సొంతోళ్లను కూడా నమ్మలేదా?

praveen
తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. స్పెషల్ ఇంటిలిజెంట్స్ బ్యూరో కేంద్రంగా సాగిన ఈ అక్రమ నిఘా అనేది కేవలం ప్రతిపక్షాలకు మాత్రమే పరిమితం కాలేదు అనే కీలక విషయాలు వెలుగులోకి వచ్చి మరింత సంచలనం సృష్టిస్తున్నాయి  అయితే ఇలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కారణంగానే అటు కేసీఆర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న విషయం తెలిసిందే.

  మొన్నటి వరకు ఇలా కేవలం ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల ఫోన్లు మాత్రమే ట్యాపింగ్ చేశారని ఎవరితో మాట్లాడుతున్నారూ.. ఎలాంటి కార్యకర్తలు నిర్వహిస్తున్నారు అనే విషయంపై ఎప్పటికప్పుడు అక్రమ నిఘా పెట్టారు అంటూ బయటపడింది. అయితే కేవలం ప్రతిపక్ష నేతలకు మాత్రమే ఈ ట్యాపింగ్ పరిమితం కాలేదని.. అధికార బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది నేతల పైన కూడా ఇలాంటి ట్యాపింగ్ జరిగింది అన్న విషయం ఇటీవల బయటపడింది. ఏకంగా గులాబీ పార్టీ పై అసమ్మతితో ఉన్న నేతల కార్యకలాపాలను తెలుసుకునేందుకు ఇలా స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్యూరో ద్వారా అక్రమ నిఘా పెట్టినట్లు బయటపడింది.

 మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ చీఫ్ టీ ప్రభాకర్ రావు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డి పి రాధా కిషన్రావు నేతృత్వంలోనే ఈ అక్రమ నిఘా సాగింది అన్నది ఇటీవల నేరంగీకార వాంగ్మూలంలో పోలీసులు పేర్కొన్నారు. నాటి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే తో విభేదించిన ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు.. ఇక కడియం శ్రీహరితో విభేదాలు ఉన్న మాజీ మంత్రి టీ రాజయ్య.. తాండూరు ఎమ్మెల్యే పై అసంతృప్తిగా ఉన్న పట్న మహేందర్ రెడ్డి దంపతులతో పాటు మాజీ ఐపీఎస్ ప్రస్తుత గులాబీ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు, రెండు మీడియా సంస్థల అధినేతలు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్, నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఫోన్లు కూడా టాపింగ్ చేసినట్లు ఇటీవల బయటపడింది. ఇలా కేసీఆర్ సొంత వాళ్ళను కూడా నమ్మకుండా ట్యాపింగ్ చేయడం మాత్రం మరింత సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: