శతమానం భవతి సీక్వెల్ లో ఊహించని మార్పులు !

Seetha Sailaja
మీడియం రేంజ్ హీరో శర్వానంద్ నటించిన సినిమాలలో ‘శతమానం భవతి’ మూవీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2017 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ బాలకృష్ణ ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాల పోటీని తట్టుకుని ఆ సంవత్సరం సంక్రాంతి రేస్ విజేతగా మారడమే కాకుండా జాతీయ స్థాయిలో అవార్డును కూడ పొందింది.

ఈ మూవీని నిర్మించిన దిల్ రాజ్ కు ఈ మూవీ పట్ల విపరీతమైన అభిమానం. ఆ అభిమానంతోనే దిల్ రాజ్ ఈ మూవీకి సీక్వెల్ తీసే ఆలోచనలు ఎప్పటి నుంచో చేతున్నాడు. ఇప్పుడు ఆ సీక్వెల్ ఆలోచనలు కార్యరూపం దాల్చడమే కాకుండా అన్నీ అనుకూలిస్తే వచ్చే సంవత్సరం సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేసి తన సంక్రాంతి సెంటిమెంట్ ను కొనసాగించాలని దిల్ రాజ్ భావిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సీక్వెల్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయింది అంటున్నారు. అయితే ఈ సీక్వెల్ లో హీరో శర్వానంద్ కు బదులు దిల్ రాజ్ కాంపౌండ్ హీరో ఆశిష్ నటిస్తాడని లీకులు వస్తున్నాయి. అతడి పక్కన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించే ఆస్కారం ఉంది అని అంటున్నారు. అయితే ఈ సీక్వెల్ కు సతీష్ వేగ్నేశ స్థానంలో ఎస్విసి సంస్థలో పదేళ్లుగా వివిధ శాఖల్లో పని చేస్తున్న హరి దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడని లీకులు వస్తున్నాయి.

అయితే రాబోయే సంక్రాంతికి టాప్ హీరోలు చిరంజీవి వెంకటేష్ నాగార్జున సినిమాలు ఇప్పటికే తమ రాకను తెలియచేస్తూ లీకులు ఇస్తున్నాయి. దీనితో రాజ్ సాహసించి ఇన్ని భారీ సినిమాల మధ్య తన ‘సత్యమానం భవతి’ సీక్వెల్ ను విడుదల చేయగలడా అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి. ఈ సీక్వెల్ కథలో బలమైన భావోద్వేగాలు ఎక్కువగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు అని అంటున్నారు. ఈమూవీకి ‘శతమానం భవతి’ కొత్తపేజీ అన్న ట్యాగ్ లైన్ ఇస్తారని టాక్..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: