ఎన్నికల వేడి లో చిక్కుకున్న సత్యదేవ్ నారా రోహిత్ !

Seetha Sailaja
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ అత్యంత నీరసంగా నడుస్తోంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాలను కూడ చూడటానికి ప్రేక్షకులు ధియేటర్లకు రావడం లేదు. దీనికి కారణాలు అనేకం. అయినా ఏదో ఒక అదృష్టం తమని కాపాడుతుందనీ అనేక చిన్న సినిమాలు ఒకదాని పై ఒకటి పోటీగా విడుదల అవ్వడంతో ఏసినిమాకు కనీసపు కలక్షన్స్ కూడ రావడంలేదు  అన్న వార్తలు వస్తున్నాయి.

ఈపరిస్థితుల మధ్య ఈవారం చిన్న హీరోలు నారా రోహిత్ సత్యదేవ్ ల మధ్య అనుకోని పోటీ ఏర్పడింది. వాస్తవానికి ఈ ఇద్దరి హీరోల కెరియర్ వరస ఫ్లాప్ లతో ఏమాత్రం బాగాలేదు అన్న కామెంట్స్ ఉన్నాయి. సత్యదేవ్ నటించిన ‘కృష్ణమ్మ’ మూవీని దర్శకుడు కొరటాల శివ సమార్పిస్తూ ఉండటంతో ఈమూవీలో ఏదో ఒక మంచి పాయింట్ ఉండి ఉంటుంది అన్న అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్ ను కొరటాల శివ దగ్గర ఉండి చూసుకోవడంతో పాటు ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిధులుగా ప్రముఖ దర్శకులను ఆహ్వానించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే విడుదలైన ఈమూవీ ట్రైలర్ చాలామందికి నచ్చడంతో సత్యదేవ్ కు ఈమూవీ మళ్ళీ బ్రేక్ ఇచ్చే ఆస్కారం ఉంది అన్న అంచనాలు వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్న నారా రోహిత్ నటించిన పొలిటికల్ మూవీ ‘ప్రతినిధి 2’ ఈవారమే విడుదల కాబోతోంది. తెలుగు రాష్ట్రాలలో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో ఈమూవీ ఏదైనా సంచలనాన్ని క్రియేట్ చేస్తుందా అన్న అంచనాలు మరికొందరిలో ఉన్నాయి.

అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోని జనం ఎన్నికలు ఎండలు ఐపిల్ గురించి తప్ప మరే విషయాల గురించి పట్టించుకోని పరిస్థితులలో ఈవారం విడుదల కాబోతున్న ఈ రెండు సినిమాలు ఏమాత్రం జనానికి కనెక్ట్ అవుతాయి అన్న సందేహాలు ఉన్నాయి దీనితో ఈవారం పోటీ పడుతున్న సత్యదేవ్ నారా రోహిత్ లలో ఎవరు విజేత అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: