బాబు గెలిచినా.. జగన్‌ గెలిచినా.. ఎలక్షన్‌ హీరో మాత్రం పవనేనా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యం ఏదైనా ఉందా అంటే జగన్ ని గద్దె దించడమే. దాని కోసమే ఆయన రేయింబవళ్లు చంద్రబాబుతో పాటు కష్టపడుతున్నారు. టీడీపీ అధినేత కష్టపడుతున్నారు అంటే.. ఇప్పుడు ఓడిపోతే ఆ పార్టీ మనుగడే కష్టం. కానీ పవన్ కు ఇంకా బోలెడు భవిష్యత్తు ఉంది. అయినా చంద్రబాబుని సీఎం చేయడమే పనిగా పెట్టుకున్నారు.

ఇదిలా ఉంచితే సీఎం జగన్ ను గద్దె దించుతా అని జనసేనాని పలు సందర్భాల్లో శపథం చేశారు.  దీనిని నెగ్గించుకునేందుకు తన శక్తికి మించి కష్టపడుతున్నారు.  దీంతో పాటు పవన్ ముందు రెండు అతిపెద్ద సవాళ్లు ఉన్నాయి. ఒకటి తన జనసేన గుర్తు కాపాడుకోవడం. అది ఎలా అంటే ఆరు శాతం ఓట్లు ఆ పార్టీ సాధించగలగాలి. ఇటీవల జనసేన గుర్తు పై జరిగిన వివాదం అంతా ఇంతా కాదు.

చావు తప్పి కన్ను లొట్ట పోయినట్లుగా హైకోర్టు జోక్యంతో ఆ పార్టీ పోటీ చేసే చోట్ల ఈసీ ఆ గుర్తును స్వతంత్రులకు ఇవ్వకుండా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆ గుర్తు పర్మినెంట్ గా జనసేనకే రావాలంటే ఆరు శాతం ఓట్లు రావాలి. 21 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లలో ఆరు శాతం ఓట్ షేర్ సాధించడం జనసేనానికి సవాలే. అంటే దాదాపు పోటీ చేసిన అన్ని చోట్ల 50శాతం ఓట్లు సాధించాల్సి ఉంటుంది.

టీడీపీతో పొత్తు తర్వాత కాపులు పవన్ నుంచి దూరం అయ్యారనే గుసగుసలు వినిపించాయి. కానీ క్రమక్రమంగా పవన్ ఆవేశ పూరిత ప్రసంగాలతో ప్రజలను ఆలోచనలో పడేస్తున్నారు. మెల్లమెల్లగా కాపులు కూడా జనసేన వైపు చూస్తున్నారు. ఎందుకంటే నారా లోకేశ్ ని పక్కన పెట్టడం చంద్రబాబు తో పాటు కూటమిలో సమ ప్రాధాన్యం ఇవ్వడం వంటి వాటితో కాపులు ఖుషీ అవుతున్నారు. వీరితో పాటు యువతరం కూడా పవన్  పట్ల ఆకర్షితులవుతున్నారు.  ఇటీవల వెలవడిన పలు సర్వేలు సైతం కూటమి వైపే మొగ్గు చూపుతున్నాయి. విశ్వసనీయత కలిగిన రవి ప్రకాశ్, ఇతర సర్వే సంస్థల రిపోర్టులతో పవన్ శపథం నెరవేరేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: