టీడీపీ ఓటమి ఖాయమని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ..?

Prathap Kaluva

టీడీపీకి ఓటమి ఖాయమని ఇప్పటికే జాతీయ చానెల్స్ నుంచి సోషల్ మీడియా వరకు అందరూ చెప్పేశారు. అయితే సోషల్ మీడియాలో వేల సంఖ్యలో టీడీపీ అనుకూల ఎకౌంట్లు డిలీట్ అవుతున్నాయి. మొన్నటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై, అధినేత జగన్ పై విరుచుకుపడిన ఎన్నో ఎకౌంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ఇదేదో ఒక్క ఫేస్ బుక్ కే పరిమితం కాదు. ట్విట్టర్, యూట్యూబ్ లో ఎక్కడ చూసినా టీడీపీ అనుకూల ఖాతాలు వేల సంఖ్యలో మాయమౌతున్నాయి.


టీడీపీ ఓడిపోతుందనే విషయం తెలిసి, మొన్నటివరకు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు సోషల్ మీడియాలో ఇలా తమ ఎకౌంట్లను డిలీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వస్తాడనే నమ్మకం ఉంటే వీళ్లు ఇలా వ్యవహరించి ఉండేవారు కాదు. కేవలం ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారు. ఫలితాలు విడుదల తేదీ దగ్గరయ్యే కొద్దీ సోషల్ మీడియాలో మరిన్ని ఎకౌంట్లు కనుమరుగవుతాయని భావిస్తున్నారు.


చంద్రబాబు తానా అంటే తందానా అనే బ్యాచ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. చంద్రబాబు కుక్కను చూపించి అది పంది అంటే వీళ్లంతా దాన్ని పందిగానే చూపిస్తారు. ట్వీట్లు, షేర్లతో ఊదరగొడతారు. మరోవైపు లోకేష్ ను సోషల్ మీడియాలో రక్షించే బ్యాచ్ కూడా ఇదే. కెమెరా ముందే కాకుండా, సోషల్ మీడియాలో కూడా దొరికిపోవడం లోకేష్ కు అలవాటే కదా. అలాంటి ఎన్నో సందర్భాల నుంచి లోకేష్ ను రక్షించడానికి వీళ్లు గతంలో చాలా ప్రయత్నించారు. కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: