త్రివిక్రమ్ మూవీలో అలాంటి పాత్రలో అల్లు అర్జున్..?

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా గుంటూరు కారం అనే సినిమాకు దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన ఈ సినిమాలో శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించగా , జయరామ్  , రమ్యకృష్ణ , ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , రాహుల్ రవీంద్రన్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు.

మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేదు. ఇది ఇలా ఉంటే గుంటూరు కారం మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరిచిన త్రివిక్రమ్ మరికొన్ని రోజుల్లో అల్లు అర్జున్ హీరో గా ఓ మూవీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరి కాంబోలో ఇప్పటికే జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి , అలా వైకుంఠపురంలో అనే మూడు మూవీ లు రూపొంది , మూడు సూపర్ సక్సెస్ కావడంతో వీరి కాంబోలో తెరకెక్కబోయే నాలుగవ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే తాజాగా ఈ క్రేజీ కాంబో మూవీ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నట్లు , అందులో భాగంగా ఓ పాత్రలో అల్లు అర్జున్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయబోతున్నట్లు , ఈ రెండవ పాత్ర సినిమాలోని ఇంటర్వెల్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అల్లు అర్జున్ ఇంతవ రకు కెరియర్ లో ఎప్పుడు చేయని విధంగా ఈ పాత్రను త్రివిక్రమ్ డిజైన్ చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: