క‌మ్మ Vs రెడ్డి పోరు ఎక్క‌డైనా మ‌స్తు మ‌జానే... ఏపీలో 12 సీట్ల‌లో వీళ్ల యుద్ధ‌మే...!

RAMAKRISHNA S.S.

- గుంటూరు నుంచి మొద‌లు అనంత‌పురం వ‌ర‌కు 12 చోట్ల క‌మ్మ Vs రెడ్డి
- బ‌లిజ సీటు చిత్తూరులోనూ వీళ్ల పోటీయే..?
- ప్ర‌కాశం, చిత్తూరు, అనంత‌పురంలో 9 సీట్ల‌లో ఈ కులాల స‌మ‌రం
( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కులాల కురుక్షేత్రం మామూలుగా ఉండ‌దు. అందులోనూ క‌మ్మ వ‌ర్సెస్ రెడ్డి నేత‌ల పోటీ అంటే మ‌స్తు మ‌జా ఉంటుంది. ఒక నియోజ‌క‌వ‌ర్గంలో ఒక పార్టీ నుంచి క‌మ్మ‌.. మ‌రో పార్టీ నుంచి రెడ్డి నేత పోటీ ప‌డితే అది ప‌ల్నాటి యుద్ధ‌మో లేదా బొబ్బిలి యుద్ధాన్నో త‌ల‌పిస్తూ ఉంటుంది. ఏపీలో ముందు కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీకి రెడ్లు సంప్ర‌దాయ ఓటు బ్యాంకుగా, నాయ‌కులుగా ఉంటూ వ‌స్తున్నారు. అదే టైంలో తెలుగుదేశం పార్టీకి క‌మ్మ‌లు ముందు నుంచి సంప్ర‌దాయ ఓట‌ర్లుగా ఉంటున్నారు. క‌మ్మ నేత‌ల్లో మెజార్టీ టీడీపీ నుంచే పోటీ చేస్తున్నారు.

తాజా ఎన్నిక‌ల్లోనూ గుంటూరులోని గుర‌జాల‌తో మొద‌లు పెట్టి సీమ‌లోని రాఫ్తాడు, అనంత‌పురం వ‌ర‌కు చూస్తే ఏకంగా 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌మ్మ వ‌ర్సెస్ రెడ్డి నేత‌ల మ‌ధ్యే పోటీ జ‌ర‌గ‌నుంది. విచిత్రం ఏంటంటే ఇక్క‌డ క‌మ్మ‌లు పోటీ చేసేది టీడీపీ నుంచి రెడ్లు అంద‌రూ వైసీపీ నుంచే.. ఈ రెండు కులాల నేత‌లు పోటీ ప‌డే చోట్ల ఒక్క క‌మ్మ నేత కూడా వైసీపీలో లేడు.. అలాగే ఒక్క రెడ్డి నేత కూడా టీడీపీలో లేడు. అయితే ఏపీలో రెడ్లు ఐదు పార్ల‌మెంటు సీట్ల‌లో, క‌మ్మ‌లు ఐదు పార్ల‌మెంటు సీట్ల‌లో పోటీ చేస్తున్నా.. వీరిద్ద‌రు ముఖాముఖీ త‌ల‌ప‌డుతోన్న పార్ల‌మెంటు సీటు ఒక్క‌టి కూడా లేదు.

విచిత్రంగా తెలంగాణ‌లో ఖ‌మ్మం పార్ల‌మెంటు స్థానంలో మాత్రం బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు పోటీలో ఉంటే... కాంగ్రెస్ నుంచి రెడ్డి వ‌ర్గానికి చెందిన ర‌ఘురామిరెడ్డి పోటీ చేస్తున్నారు. మ‌ళ్లీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక్క పార్ల‌మెంటు సీట్లో మాత్రం క‌మ్మ వ‌ర్సెస్ రెడ్డి పోరు జ‌రుగుతోంది. ఏపీలో క‌మ్మ వ‌ర్సెస్ రెడ్డి నేత‌లు ముఖాముఖీ త‌ల‌ప‌డే 12 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు.. పోటీ చేస్తోన్న అభ్య‌ర్థుల పేర్ల‌ను ఇండియా హెరాల్డ్ మీకోసం ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది.

1) గుర‌జాల‌: య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు ( టీడీపీ ) - కాసు మ‌హేష్ రెడ్డి ( వైసీపీ)
2) ద‌ర్శి:  డాక్ట‌ర్ గొట్టిపాటి ల‌క్ష్మి ( టీడీపీ ) - బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డి ( వైసీపీ)
3) అద్దంకి: గొట్టిపాటి ర‌వికుమార్ ( టీడీపీ) - పాణెం చిన్న హ‌నిమిరెడ్డి ( వైసీపీ)
4) ఒంగోలు: దామ‌చ‌ర్ల జ‌నార్థ‌న్ ( టీడీపీ) - బాలినేని శ్రీనివాస్ రెడ్డి ( వైసీపీ)
5) ఉద‌య‌గిరి: కాక‌ర్ల సురేష్ ( టీడీపీ) - మేక‌పాటి రాజ్‌గోపాల్ రెడ్డి ( వైసీపీ)
6) వెంక‌ట‌గిరి: కురుగొండ్ల రామ‌కృష్ణ ( టీడీపీ) - నేదురుమిల్లి రామ్‌కుమార్ రెడ్డి ( వైసీపీ)

7) చిత్తూరు: గుర‌జాల జ‌గ‌న్మోహ‌న్ ( టీడీపీ) - ఎం. విజ‌యానంద‌రెడ్డి ( వైసీపీ)
8) న‌గ‌రి: గాలి భానుప్ర‌కాష్ నాయుడు ( టీడీపీ) - ఆర్కే రోజా రెడ్డి ( వైసీపీ )
9) చంద్ర‌గిరి:  పులివ‌ర్తి నాని ( టీడీపీ) - చెవిరెడ్డి మెహిత్ రెడ్డి ( వైసీపీ)
10) రాఫ్తాడు:  ప‌రిటాల సునీత ( టీడీపీ) - తోపుదుర్తి ప్ర‌కాష్ రెడ్డి ( వైసీపీ)
11) అనంత‌పురం: ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర ప్ర‌సాద్ ( టీడీపీ ) - అనంత వెంకట్రామిరెడ్డి ( వైసీపీ )
12) ఉవ‌ర‌కొండ‌: ప‌య్యావుల కేశ‌వ్ ( టీడీపీ) - వై. విశ్వేశ్వ‌ర్ రెడ్డి ( వైసీపీ )
పార్ల‌మెంటు సీటు:
1) ఖ‌మ్మం ( తెలంగాణ‌):  నామా నాగేశ్వ‌ర‌రావు ( క‌మ్మ - బీఆర్ఎస్‌) - రామ‌స‌హాయం ర‌ఘురామిరెడ్డి ( రెడ్డి - కాంగ్రెస్ )

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: