ఇంటర్వ్యూలో అలాంటి ప్రశ్న ఎదురుకున్న 'జయమ్మ'...!!

murali krishna
ఇటీవల తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటి దక్కించుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్.రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ సినిమా లో జయమ్మ పాత్ర లో ఆకట్టుకుంది.ఈ సినిమా తర్వాత ఈమెకు వరుస అవకాశాలు అందడం.. ఈమె నటించిన ప్రతి సినిమా హిట్ కావడంతో వరలక్ష్మి స్టార్ సెలబ్రిటీ గా మారిపోయింది. ఇక హనుమాన్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ అమ్మడు.. ప్రస్తుతం శబరి అనే లేడీ ఓరియంటెడ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ సినిమాలో నటిస్తుంటే కచ్చితంగా సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది అనే నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో మొదలైంది. ఇక తండ్రి.. హీరో శరత్ కుమార్ కు తగ్గట్టుగానే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను ఏర్పరచుకున్నది ఈ భామ.అయితే శబరి మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూ లో పాల్గొంది వరలక్ష్మి. ఈ ఇంటర్వ్యూలో వరలక్ష్మి శరత్ కుమార్‌కు ఇంటర్వ్యూవర్ నుంచి ప్రశ్న ఎదురైంది.ఆమె ఎన్నో ఆడిషన్స్, అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ ఫోటోలు పట్టుకొని తిరగడం లాంటివి జరిగాయని విన్నాం. అలాగే శంకర్ డైరెక్షన్‌ లో బాయ్స్, ప్రేమిస్తే సినిమాలో మీకు హీరోయిన్గా అవకాశం వచ్చిందట కదా అంటూ ఇంటర్వ్యూవర్ ప్రశ్నించాడు.అయితే అప్పట్లో హీరోయిన్గా ఇలాంటి సినిమా ల్లో నటించి ఉంటే మీ కెరీర్ మరింత ఫామ్ లో ఉండేదని.. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అని ప్రశ్నించగా.. అనుకోని కారణాల తో ఆ సినిమా లను మిస్ చేసుకోవాల్సి వచ్చిందని.. అయితే అప్పట్లో హీరోయిన్గా చేసి ఉంటే ఇప్పటికీ ఫేడౌట్ అయిపోయే దాన్నేమో.. ఇలా ఇప్పుడు చేస్తున్న క్యారెక్టర్ అయితే లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయవచ్చు అంటూ వరలక్ష్మి వివరించింది. అయితే ఇలాంటి రెండు హిట్ సినిమాలు మిస్ చేసుకున్నందుకు ఇప్పటి కి బాధడుతున్నానని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: