చెన్నైలో షురూ కానున్న "గేమ్ చేంజర్"..?

Pulgam Srinivas
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది.

ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా యొక్క షూటింగ్ ను చాలా స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ బృందం ఇన్ని రోజుల పాటు హైదరాబాదు లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేస్తూ వచ్చారు. తాజాగా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఈ మూవీ యూనిట్ తాజాగా రామ్ చరణ్ , సునీల్ , నవీన్ చంద్ర కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి కావడంతో ఈ మూవీ బృందం తదుపరి షెడ్యూల్ చెన్నై లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో చిత్ర బృందం చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: