పీకే మూవీ న్యూడ్ సన్నివేశం గురించి స్పందించిన అమీర్..!

Pulgam Srinivas
బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరో గా నటించి ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే తాజాగా అమీర్ ఖాన్ , కపిల్ షో కు ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఆ షో లో భాగంగా ఈయన అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా అమీర్ ఖాన్ , కపిల్ షో లో భాగంగా పీకే మూవీ లోని న్యూడ్ సన్నివేశం గురించి మాట్లాడారు. తాజాగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ ... రాజ్ కుమార్ హీరానీ దర్శకత్వంలో నేను పీకే అనే మూవీ లో నటించాను.

ఆ సినిమాలో నేను న్యూడ్ సన్నివేశం చేశాను. ఇకపోతే ఆ రోజు నేను టేప్ తో ఫిక్స్ చేసిన షర్టు ను ధరించి సెట్ కు వచ్చా. నడుస్తున్నప్పుడు బాగానే ఉంది కానీ పరిగెత్తుతున్నప్పుడు చాలా కష్టంగా అనిపించింది. దానితో షాట్ ఫర్ఫెక్ట్ గా రావడం కోసం షర్టును తీసేసి పరిగెత్త , ఆ సమయంలో నేను ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. ఆ షాట్ చేయడంపై నేను కూడా షాక్ అయ్యాను అని తాజాగా కపిల్ షో లో అమీర్ చెప్పుకొచ్చారు. ఇకపోతే రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్ ఖాన్ హీరో గా రూపొందిన పీకే మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను వసూలు చేసింది.

ఇకపోతే ఈ మూవీ లోని అమీర్ ఖాన్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే అమీర్ కొంత కాలం క్రితం లాల్ సింగ్ చడ్డ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య కూడా ఓ కీలకమైన పాత్రలో నటించాడు. మంచి అంచనాల నడుమ ఈ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: