దిమ్మ తిరిగే రెమ్యూనరేషన్ తో రజనీకాంత్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్..!?

Anilkumar
73 ఏళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకి ఏమాత్రం తీసుకుపోకుండా ఆడియన్స్ కి పిచ్చెక్కిస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ ఆయన జోరు చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన వెట్టయాన్ సినిమా షూట్ పూర్తి చేశాడు. త్వరలోనే కూలీ సినిమా షూట్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఇది వరకు జైలర్ సినిమా కంటే ముందే ఆయన పని అయిపోయింది.. ఆయన ఫామ్ లోకి రావడం కష్టమే అని అందరూ అనుకున్నారు.. కానీ అందరి అంచనాలకి దీటుగా ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు

 సూపర్ స్టార్. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కో సినిమాకి తీసుకుంటున్న రెమ్యునరేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే వెట్టయాన్ సినిమా కోసం ఆయన ఏకంగా 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోయే కూలీ సినిమా కోసం ఏకంగా 260 కోట్ల రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నట్లుగా సమాచారం. అయితే రెమ్యునరేషన్ విషయంలో ఎప్పుడు ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తాడు ఆయన. తాజాగా ఇప్పుడు గొట్ సినిమా కోసం విజయ్ 175 కోట్లు

 తీసుకుంటున్నాడు. ఆ తర్వాత దాన్ని కాస్త 250 కోట్లు చేశారు. ఇప్పుడు దానికి 10 కోట్లు ఎక్కువగా కూలి కోసం తీసుకుంటున్నాడు రజినీకాంత్. ఇదిలా ఉంటే లోకేష్ కనగరాజ్ సైతం 60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. కాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో జూన్ 6 నుండి జాయిన్ కానున్నాడు సూపర్ స్టార్. ఇక గత ఏడాది జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీకాంత్ ఆ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. మరి జైలర్ సినిమాతో భారీ ఎత్తున సక్సెస్ అయిన సూపర్స్టార్ ఈ సినిమాలతో ఎటువంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: