జగన్ నిశ్శబ్ధం వెనుక వ్యూహమా? విస్పోటనమా?

గత కొన్నిరోజులుగా వైసిపి నేత వైఎస్ జగన్మోహనరెడ్డి తాజాగా చాలా మౌనంగా, నిశ్శబ్ధంగా, సైలెంట్‌ గా అంతకు మించి కూల్ గా ఉంటున్నారు.  ఒకవైపు అధికార పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం జీవితంలో సంతోషం అంటే ఏమిటో మరచిపోయారు. స్వయంకృతాపరాధానికి పరులను నిందిస్తూ కాలం అంతా మానసిక ఉద్వేగంతో గడుపుతున్నారు.

చివరకు రాజ్యాంగం ప్రకారం అధికారాలున్న ఎన్నికల సంఘాన్ని సైతం బెదిరించారు దూషించారు ఆరోపనలు చేశారు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు నైపుణ్యం లెదని పనివాడు పరికరాల్ని నిందించినట్లు – తన విజయం సంశయాస్పదం కావతంతో ఈవిఎం,  వీవీప్యాట్లది దోషమనే ఆరోపణలు చేస్తూ తన గెలుపు మాత్రం 1000% అనే అసంభవమైన ఫిగర్ తో గ్యారంటీ అంటూ గొంతు చించుకుంటున్నారు.  

ప్రతిపక్షనేతను అత్యంత అగౌరవమైన భాషతో తిట్టినా, ఆయన మాత్రం ఎలాంటి ప్రతిస్పందన కాదు సరికదా! అసలు స్పందనే ఇవ్వకుండా నిశ్శబ్ధం పాటిస్తున్నారు. ఏపీ ఎన్నికల అనంతరం ఒకసారి స్పందిస్తూ, భారీ మెజార్టీతో వైసిపి గెలుస్తుందని చెప్పి విదేశాలకు చేక్కేశారు. ఆ తర్వాత జగన్ ఎక్కడ నోరు మెదపలేదు. కనీసం ఫలితాలపై సోషల్ మీడియా లో కూడా ఎలాంటి పోస్టులు పెట్టలేదు. 

ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర చోటా మోటా నాయకులు మాత్రం పెట్టిన ప్రెస్ మీట్లు మళ్లీ పెట్ట కుండా ఢంకా మోగించి మరి మళ్లీ గెలిచేది మేమే! అంటూ ఘంతాపథంగా చెపుతున్నారు. టీడీపీ నేతలు విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నా కూడా జగన్ మాత్రం అసలు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. దీంతో జగన్ మౌనం నేపధ్యంలో ఇప్పుడు వైసీపీలో చర్చ జరుగుతోంది. ఎందుకు మన నాయకుడు మౌనమునిలా మారాడు? అని చర్చించు కుంటున్నారు ఆ పార్టీ నేతలు. 

అధికార పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తుంటే, జగన్ ఎందుకు కనీసం ఒక్కసారైనా నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని గుసగుసలాడు కుంటున్నారు.
జగన్ మౌనం వెనుక మర్మం ఏమిటి? అనేది ఆ పార్టీలో ఎవరికి అంతు పట్టడం లేదు. కనీసం వారందరిని పిలిచి ఫలితాలపై సమీక్షా  సమావేశాలు కూడా నిర్వహించట్లే దేమిటి? అన్న ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు వైసీపీ నేతలు. 

అయితే కొందరు మాత్రం జగన్ నిశ్శబ్ధం రాజకీయ వ్యూహంలో  భాగమే కవచ్చని భావిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో విజయం వైసీపీ దేనని చాలా వరకు సర్వేలు తేల్చాయి.
దీంతో ఇలాంటి సమయంలో నిశ్శబ్ధం భాష మాత్రమే బాగుటుమందని అని జగన్ అనుకుంటున్నారు. గతంలో 2019లో ఎదురైన చేదు అనుభవం మళ్లీ పునఃదర్శనం కాకూడదనే, జగన్ సైలెన్స్ గా ఉన్నారంటున్నరు. 

అందుకే జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వైసిపి వాళ్ళందరు కూడా సైలెంట్‌ గా ఉండాలనుకుంటున్నారని చెబుతున్నారు. ఏదీ ఏమైనా జగన్ పాటించే నిశ్శబ్ధం పై  మాత్రం ఇటు టీడీపీ, అటు వైసీపీ నాయకులు అనేక రకాల అరిథమెటిక్ కాలిక్యులేషన్లు  వేసుకుంటూ కొత్త  కొత్త చర్చలకు తెరలేపుతున్నారు. అయితే జగన్ మాత్రం నిశ్శబ్ధాన్ని బ్రేక్ చేయటానికి మే 23 వరకు ఎదురు చూస్తున్నారు. నిశ్శబ్ధం బ్రేక్ అయితే విస్పోటనమేనా? అయితే అది ఎవరి గుండెల్లో అనేదే ప్రధాన ప్రశ్న. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: